Microsoft Buyout: మైక్రోసాఫ్ట్ 'బైఅవుట్' ఆఫర్: ఉద్యోగం వదిలేస్తే డబ్బులు.. అసలు ఏంటి ఈ స్కీమ్?

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 51 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని తన ఉద్యోగులకు 'వాలంటరీ బైఅవుట్' (Voluntary Buyout) ఆఫర్‌ను ప్రకటించింది. సాధారణంగా కంపెనీలే ఉద్యోగులను తీసేయడం (Layoffs) మనం చూస్తుంటాం. కానీ, మైక్రోసాఫ్ట్ మాత్రం "మీకు ఇష్టమైతే ఉద్యోగం వదిలేయండి.. మీకు భారీగా మనీ ఇస్తాం" అంటూ బై అవుట్ (microsoft buyout) ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న మార్పుల వల్ల కంపెనీ తన పనితీరును మార్చుకోవడమే దీనికి ప్రధాన కారణం.

Microsoft offers voluntary buyout to US staff as AI shifts workforce details

అసలు 'బైఅవుట్' అంటే ఏమిటి?

చాలా మందికి లేఆఫ్స్‌కి, బైఅవుట్‌కి తేడా తెలియదు. లేఆఫ్ అంటే కంపెనీ బలవంతంగా ఉద్యోగిని తీసేయడం. కానీ, బైఅవుట్ అంటే ఉద్యోగికి ఒక చాయిస్ ఇవ్వడం. "నువ్వు సొంతంగా వెళ్ళిపోతే.. నీకు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు, మరికొన్ని నెలల పాటు హెల్త్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ ప్లాన్స్ ఇస్తాం" అని కంపెనీ ఆఫర్ చేస్తుంది. అంటే, ఎవరైనా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నవారు లేదా కొత్తగా ఏదైనా చేయాలనుకునే వారు ఈ బైఅవుట్ ఆఫర్‌ను వాడుకుని గౌరవప్రదంగా కంపెనీ నుంచి బయటకు వచ్చేయవచ్చు.

ఎవరెవరు అర్హులు?

మైక్రోసాఫ్ట్ తన అమెరికా ఉద్యోగుల్లో సుమారు 7 శాతం మందికి ఈ ఆఫర్ ఇచ్చింది. అయితే దీనికో చిన్న కండిషన్ ఉంది.

  • సీనియర్ డైరెక్టర్ స్థాయి అంతకంటే తక్కువ కేడర్ వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
  • ముఖ్యమైన నియమం: ఉద్యోగి వయస్సు, ఆ కంపెనీలో పనిచేసిన ఏళ్లు.. ఈ రెండింటిని కలిపితే 70 అంతకంటే ఎక్కువ ఉండాలి.
  • ఉదాహరణకు, మీ వయస్సు 50 ఏళ్లు ఉండి, మీరు మైక్రోసాఫ్ట్‌లో 20 ఏళ్లుగా పనిచేస్తుంటే, మీరు ఈ ఆఫర్‌కు అర్హులు.

అయితే సేల్స్ విభాగంలో ఉండి ఇన్సెంటివ్స్ తీసుకునే వారికి మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మే 7న కంపెనీ వెల్లడించనుంది.

ఎందుకీ నిర్ణయం?

ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఏఐ (AI) శాసిస్తోంది. మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ మౌలిక సదుపాయాల కోసం, డేటా సెంటర్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తోంది. పాత పద్ధతుల్లో పనిచేసే ఉద్యోగాల కంటే, ఇప్పుడు ఏఐకి సంబంధించిన నైపుణ్యాలు ఉన్నవారే కంపెనీకి అవసరం. అందుకే పాత ఉద్యోగులను బలవంతంగా తీసేసి విమర్శలు పాలవ్వడం కంటే, ఇలా బైఅవుట్ (microsoft buyout)ఇచ్చి స్వచ్ఛందంగా పంపించేయడం బిల్ గేట్స్ స్థాపించిన ఈ కంపెనీకి మేలనిపించింది.

లాభమా? నష్టమా?

కంపెనీకి ఇది ఖర్చు తగ్గించుకునే మార్గం. ఉద్యోగులకు మాత్రం ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యంగా రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారికి, మైక్రోసాఫ్ట్ ఇచ్చే ఈ 'జెనరస్ సపోర్ట్' ఒక వరమనే చెప్పాలి. 2025 జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, అమెరికాలోనే 1.25 లక్షల మంది ఉన్నారు. గతంలో కొన్ని సార్లు లేఆఫ్స్ చేసిన కంపెనీ, ఈసారి మాత్రం చాలా సాఫీగా మార్పు తీసుకురావాలని చూస్తోంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఉద్యోగాలు కూడా మారక తప్పదని ఈ బైఅవుట్ (microsoft buyout) ప్రోగ్రామ్ నిరూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+