మైక్రోసాఫ్ట్ నుండి 15 వేల మంది ఉద్యోగులు బయటకు..బాధగా ఉందంటూ సీఈఓ నాదెళ్ల ఎమోషనల్ నోట్

మైక్రోసాఫ్ట్ లో ఈ ఏడాది భారీగా ఉద్యోగ తొలగింపులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు కంపెనీ సుమారుగా 15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపులు సంస్థ చరిత్రలోనే కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ తొలగింపుల ద్వారా లేఆప్స్ కు గురైన ఉద్యోగులకు కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ఓ భావోద్వేగపూరిత మెమోతో సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందేశం ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు.

నాదెళ్ల మెమోలో మాట్లాడుతూ..15 వేల మంది ఉద్యోగుల తొలగింపులు అంత సులభం కాదు. ఉద్యోగం కోల్పోయి మీరు అనుభవిస్తున్న బాధను మేము అర్థం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. జూలై మొదటివారంలోనే 9 వేల మందికి పైగా ఉద్యోగులను లేఆప్స్ ద్వారా కోల్పోయామని.. సంస్ధ మారుతున్న వ్యూహాలకు అనుగుణంగా కంపెనీ మారాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతుం మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల మొత్తం సంఖ్య స్థిరంగా ఉందన్నారు. సంస్థ భవిష్యత్తుపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని అలాగే కలిగి ఉన్నామని చెప్పారు.

Microsoft layoffs 2025 Satya Nadella emotional memo Microsoft job cuts Microsoft 15000 layoffs tech layoffs news Microsoft CEO message Nadella employee letter Microsoft restructure 2025 Microsoft employee memo Microsoft downsizing tech industry layoffs Satya Nadella layoffs Microsoft job loss 2025 15000 2025 downsizing 2025 Satya Nadella memo 15

కంపెనీ ఉద్యోగ తొలగింపుల తర్వాత కూడా..స్టాక్ మార్కెట్లో జూలై 9న తొలిసారిగా కంపెనీ షేరు 500 డాలర్ల మార్కును దాటింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. AI, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌లలో సంస్థ ఆధిపత్యం వంటి అంశాలు దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. OpenAIతో భాగస్వామ్యం, Azure వృద్ధి, అలాగే Nvidia చిప్‌లను వినియోగించే సామర్థ్యం సంస్థపై పెట్టుబడిదారులకు నమ్మకాన్ని పెంచుతోంది.

సత్య నాదెళ్ల తన ఎమోషనల్ నోట్ లో సంస్థ వృద్ధి ఒకే దశలో జరిగేది కాదన్నారు. కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుందని తెలిపారు. ఇది సవాల్ గా మారి నాయకత్వం చూపేందుకు కొత్త అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. కృత్రిమ మేధతో చోటుచేసుకొంటున్న మార్పులు గందరగోళంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మార్పునకు ఇది మనకిచ్చే సరికొత్త అవకాశమని దీని ఉపయోగించుకుని భవిష్యత్తులో మరింతగా ముందుకుసాగండని సత్య నాదెళ్ల (Satya Nadella) లేఆప్స్ ఉద్యోగులకు తెలిపారు.

ప్రస్తుతం అన్ని కంపెనీలు AI ఆధారిత భవిష్యత్తుకు రెడీ అవుతున్నాయని కాబట్టి సంస్థను దాని వైపు నడిపించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. భూమిపై ప్రతి వ్యక్తి, సంస్థ మరింత అభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా కృత్రిమేధ సంస్కృతికి అలవాటుపడాల్సిందేనని చెప్పుకొచ్చారు. కొత్తతరం ఏఐ అంటే కేవలం కొన్నింటికి అవసరమైన టూల్స్‌ను అభివృద్ధి చేయడం కాదని.. ప్రతిఒక్కరూ సొంతంగా తమకు అవసరమైన టూల్స్‌ను తయారుచేసుకునేందుకు కావాల్సిన టూల్స్‌ను అభివృద్ధి చేయాలన్నారు.

మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు.. 2025లో టెక్ రంగంలో 80,000కి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీలు AI ఆధారిత భవిష్యత్తుకు తమను తాము సన్నద్ధం చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో. Indeed, Glassdoorల మాతృసంస్థ Recruit Holdings కూడా 1300 ఉద్యోగాల కోతకు వెళ్లింది. ఇందులో AI కీలక పాత్ర వహించిందని CEO నాదెళ్ల పేర్కొన్నారు.ఏదేమైనా ఉద్యోగులను కోల్పోయిన బాధ ఒక వైపు, మిగిలినవారిలో నూతన ఆశను నింపే దృక్కోణాన్ని సత్య నాదెళ్ల మెమో ద్వారా వివరించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+