టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే చర్చ.. అది మైక్రోసాఫ్ట్‌లో రాబోయే భారీ లేఆఫ్స్ గురించి. 2026 సంవత్సరం ఆరంభంలోనే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాది మంది ఉద్యోగులను తొలగించబోతోందని వస్తున్న వార్తలు ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా జనవరి నెలలో ఈ ప్రక్రియ మొదలవుతుందని సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే ఈ వార్తలపై మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు స్పందించింది.

ఏమిటా నివేదిక? ఎందుకీ ఆందోళన?
టిప్‌ర్యాంక్స్ (TipRanks) అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ సుమారు 11,000 నుండి 22,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తుందట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల అజూర్ క్లౌడ్ సర్వీసెస్, ఎక్స్‌బాక్స్ (Xbox), గ్లోబల్ సేల్స్ విభాగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ నివేదిక పేర్కొంది. ఎక్స్ (X), బ్లూస్కీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వార్త కార్చిచ్చులా వ్యాపించడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
కంపెనీ ఏమంటోంది? అసలు నిజం ఇదీ!
ఈ నివేదిక వైరల్ అయిన వెంటనే మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ ఎక్స్. షా (Frank X. Shaw) రంగంలోకి దిగారు. ఈ వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. ఈ నివేదిక "100 శాతం అవాస్తవం, ఊహాజనితం" అని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 17 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న షా, సోషల్ మీడియాలో యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. లేని వార్తలను సృష్టించవద్దని కోరారు. విండోస్ సెంట్రల్ ఎడిటర్ జెజ్ కార్డెన్ కూడా ఈ నివేదికను తప్పుబట్టారు. ముఖ్యంగా ఎక్స్‌బాక్స్ విభాగంలో లేఆఫ్స్ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు.
గత అనుభవాలే ఈ భయానికి కారణమా?
మైక్రోసాఫ్ట్ గతంలో కూడా ఉద్యోగాల కోత చేపట్టిన చరిత్ర ఉంది. జూలై 2025లో సుమారు 9,000 మందిని తొలగించింది. అప్పట్లో ఎక్స్‌బాక్స్ హెడ్ ఫిల్ స్పెన్సర్ మాట్లాడుతూ.. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా చురుగ్గా పనిచేయడం కోసం ఈ పునర్వ్యవస్థీకరణ తప్పలేదని వివరించారు. ఆ సమయంలో కొన్ని గేమింగ్ ప్రాజెక్టులు రద్దవ్వడం, స్టూడియోలు మూతపడటం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ (Microsoft Layoffs) గురించి చిన్న వార్త వచ్చినా ఉద్యోగులు ఉలిక్కిపడుతున్నారు.
ఆర్థికంగా పటిష్టంగానే మైక్రోసాఫ్ట్!
ఒకవైపు లేఆఫ్స్ వార్తలు వస్తున్నా మైక్రోసాఫ్ట్ ఆర్థికంగా మాత్రం అత్యంత పటిష్టంగా ఉంది. జూలై 2025 నాటికి ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంతటి భారీ మార్కెట్ విలువ ఉన్నప్పటికీ.. సంస్థ తన వ్యాపార అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తుండటం వల్ల ఇలాంటి ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ అధికారికంగా లేఆఫ్స్ లేవని చెబుతున్నప్పటికీ, టెక్ రంగంలో మారుతున్న పరిస్థితులను బట్టి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఏదేమైనా ప్రస్తుతానికి 22,000 మంది తొలగింపు అనేది కేవలం ఒక ఊహాగానం మాత్రమే. మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ ఈ వార్తలను కొట్టిపారేయడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications