మైక్రోసాప్ట్ మేనేజర్ కన్నీటి కథ: 25 ఏళ్లుగా కంపెనీ కోసం పనిచేస్తుంటే ఒక్క క్షణంలో బయటకు తరిమేసింది

ఇది ఒక సీనియర్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి గాథ. ఒకే సంస్థలో 25 సంవత్సరాలుగా విశ్వాసంతో, స్థిరంగా సేవలందించిన ఆయన... చివరికి 'తనకూ ఇక చోటు లేదు' అనే పరిస్థితిలో నెట్టివేయబడ్డాడు. AI ప్రాధాన్యత పెరుగుతోందని, సంస్థ కొత్త దిశలో పయనిస్తున్నదని కంపెనీ చెబుతున్నా ఈ మార్గదర్శకాల్లో ఆయనకు స్థానం లేకపోవడం అయినకి గుండె నొప్పించేదే. ఇంతకాలం నిబద్ధతగా చేసిన సేవలు కూడా ఆధునిక టెక్నాలజీకి ఎదురుగా నిలవలేకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. మారుతున్న ప్రపంచంలో, వందల నెలల సేవలు కూడా ఒక్క డేటా నిర్ణయానికి ఎదురులేవని ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది.

Microsoft Layoffs 2025 Senior Manager With 25 Years of Service Laid Off Amid AI Restructuring Move AI Microsoft Layoffs 2025 25-year Microsoft employee Senior manager laid off Artificial Intelligence job cuts Microsoft employee story Tech layoffs emotional impact

2025లో మైక్రోసాఫ్ట్ రెండోసారి భారీ ఉద్యోగాల కోత చేపట్టింది. ఈసారి లేఅఫ్‌ల ప్రభావం 9,000 మందిపై పడింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ లేఅఫ్‌లో 25 ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్ మేనేజర్ కూడా బాధితుడయ్యాడు. అమెరికాలో ఆధారంగా ఉన్న ఆ ఉద్యోగి, ఇటీవలే తన సేవల 25వ వార్షికోత్సవాన్ని సంస్థలో జరుపుకున్నాడు. కానీ కొన్ని రోజులకే సంస్థ ఇచ్చిన నోటీసుతో అతడి ప్రయాణం అక్కడితో ముగిసిపోయింది.

మైక్రోసాఫ్ట్ ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ, సంస్థ నిర్మాణాన్ని మరింత చురుకుగా, సమర్థవంతంగా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మార్పులలో భాగంగా, అనేక మిడిల్ లెవల్ మేనేజ్మెంట్ పోస్టులను తొలగించడం జరిగింది. అనుభవం, విశ్వసనీయత అన్న మాటలు పక్కనబడి, ఆటోమేషన్, కాస్ట్ కటింగ్, ప్రోడక్టివిటీ లాంటి పదాలకే ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో, 25 ఏళ్ల నిబద్ధతకూ ఇక చోటులేనట్లుగా ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది.

ఈ సీనియర్ ఉద్యోగి తన బాధను "లింక్డ్ఇన్" వేదికగా పంచుకుంటూ, "నాకు తెలిసిన ప్రపంచం ఒక్క రోజులో మారిపోయింది" అన్న భావోద్వేగపూరిత వ్యాఖ్య చేశారు. ఇది ఒక వ్యక్తిగత కథ మాత్రమే కాదు. టెక్ రంగంలో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులకు ఇది హెచ్చరిక లాంటి ఉదాహరణ. 'ఎంత కాలం పనిచేశావు?' అనే ప్రశ్న కన్నా, 'ఈ కొత్త మార్పులకు ఎంత త్వరగా, తక్కువ ఖర్చుతో సరిపోతావు?' అన్నదే ఇప్పుడు ప్రాముఖ్యంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు పెరగడం, ఖర్చులు పెరగడం వంటి అంశాలు కూడా కంపెనీలు తమ ఖర్చును తగ్గించడానికి ప్రేరేపిస్తున్నాయి. కోవిడ్ సమయంలో అధికంగా ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు, ఇప్పుడు డిమాండ్ తగ్గిపోవడంతో, ఆ ఉద్యోగాలను తగ్గించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

ఉద్యోగం కోల్పోవడం వల్ల ఉద్యోగులు ఎదుర్కొన్న ఆందోళన, నిరాశ, భయాలు, కుటుంబంపై వచ్చే ప్రభావం చాలానే ఉంటుంది. కొందరు ఉద్యోగులు తమ జీవితకాలం కేటాయించిన సంస్థ నుంచి ఇలా జరగడం వల్ల చాలా మనోవేదనకి గురిచేస్తుంది. ఈ సీనియర్ మేనేజర్ ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ, ఆయన వర్క్ ప్లేస్‌లో తన విలువైన స్థానాన్ని ఎవరూ మర్చిపోలేరని తనతో పని చేసిన సహచరులు చెప్పిన మాటల ప్రకారం, ఆయన కేవలం ఒక మేనేజర్ మాత్రమే కాదు ఒక గైడ్, మెంటర్, మానవీయతతో కూడిన నాయకుడు. రోజువారీ పనుల్లో సహకారం అందించడమే కాకుండా, తన జూనియర్లను ఎదగడానికి ప్రోత్సహించే మంచి ఆచరణాత్మక నాయకత్వం ఆయనలో కనిపించింది. ఆయన ఎప్పుడూ టీమ్ విజయానికే ప్రాధాన్యత ఇచ్చేవారు, వ్యక్తిగత కీర్తికీ కాదు. తన జ్ఞానం పంచుకునేందుకు ఎప్పుడూ ముందుండేవారు.

ఒక నిబద్ధతతో కూడిన మానవతా నాయకత్వం కలిగిన వ్యక్తిని ఒక ఆర్గనైజేషన్ కోల్పోవడం నిజంగా బాధాకరం. AI ఆధారిత డిసిషన్లకు బదులు, మానవ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వపు ఉద్యోగ స్థలాలకు ఒక స్పూర్తి. ఆయన మరింత ప్రాధాన్యం కలిగిన ఇతర సంస్థల్లో త్వరగా గుర్తింపు పొందాలని అనుకుందాము.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+