ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్: ఒకేసారి 6800 మందిని ఇంటికి !
microsoft layoffs: టెక్ రంగాన్ని ఉద్యోగాల తొలగిపులు పట్టిపీడిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే చాల కంపెనీలు ఇప్పటివరకు వేల మందిని ఇంటికి పంపాయి. ఈ తరుణంలోనే తాజాగా మైక్రోసాఫ్ట్ మరోసారి తొలగింపులు చేపట్టింది. ఈసారి ఏకంగా 6800 మందికి పైగా ఉద్యోగులు తొలగించనుంది. ఈ తొలగింపుల ప్రభావం ప్రతి స్థాయిలో, ప్రతి టీంలో ఇంకా ప్రతి చోట ఉన్న ఉద్యోగుల పై పడనుంది.

మైక్రోసాఫ్ట్ భారీ తొలగింపులు ఎందుకు చేస్తుందంటే : వేగంగా మారుతున్న మార్కెట్‌లో విజయవంతంగా కొనసాగాలంటే మార్పులు చేయడం కంపెనీకి ముఖ్యమని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి అన్నారు.
అలాగే ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో దాదాపు 3 శాతం మందిని తొలగించనున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో దాదాపు 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే 2023 సంవత్సరం తర్వాత మైక్రోసాఫ్ట్‌లో ఇదే అతిపెద్ద తొలగింపులు. 2023 సంవత్సరంలో చూస్తే కంపెనీ దాదాపు 10 వేల మంది ఉద్యోగుల కోత విధించింది. CNBC నివేదిక ప్రకారం, ఈ తొలగింపులు పనితీరు ఆధారంగా లేవు. కానీ కంపెనీలో పెద్ద మార్పులో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి CNBCకి తెలిపారు.
మైక్రోసాఫ్ట్‌లో తొలగింపులు జరగడానికి ఇదే కారణం: ఈ తోలగింపులు ఏ పోస్టులు లేదా ఏ విభాగాలపై ప్రభావం చూపుతాయో మైక్రోసాఫ్ట్ పేర్కొననప్పటికీ AI, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా మారుతున్న కస్టమర్ డిమాండ్ల ప్రభావంతో వేగంగా మారుతున్న మార్కెట్‌లో చురుగ్గా ఇంకా పోటీతత్వంతో ఉండటానికి దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని తెలిపింది.
టెక్ పరిశ్రమలో వరుసగా ఉద్యోగుల తొలగింపులు ఎదుర్కొంటున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపు వార్త వచ్చింది. గత వారం సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ కూడా కంపెనీ ఉద్యోగులలో 5% మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. లాభదాయకమైన టెక్ దిగ్గజాలు కూడా మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను ఎలా సర్దుబాటు చేసుకుంటున్నాయో హైలైట్ చేసింది. ఇక మైక్రోసాఫ్ట్ గురించి చెప్పాలంటే ఉద్యోగుల తొలగింపులు ఉన్నప్పటికీ కంపెనీ ఆర్థికంగా బలంగా ఉంది. ఏప్రిల్‌తో ముగిసిన త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ నికర ఆదాయం $25.8 బిలియన్లు.
మైక్రోసాఫ్ట్ షేర్లు గత సోమవారం చూస్తే $449.26 వద్ద ట్రేడవుతున్నాయి, అయితే ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధిక ధర. గత ఏడాది జూలైలో షేర్ల ధర రికార్డు గరిష్ట స్థాయి $467.56 వద్ద ముగిసింది. మీడియా నివేదికల నుండి అందిన సమాచారం ప్రకారం, తొలగించనున్న ఉద్యోగులందరినీ 2 సంవత్సరాలలోపు తిరిగి నియమించకూడదని కంపెనీ ఒక పరిమితి కూడా విధించింది. మైక్రోసాఫ్ట్ 1975 సంవత్సరంలో ప్రారంభించగా, US (యునైటెడ్ స్టేట్స్) ఆధారిత కంపెనీ. ఈ కంపెనీ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. నేడు, మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా ఉంది.


Click it and Unblock the Notifications