ఏ దేశంలో ఉన్నా 24 గంటల్లో అమెరికాకు తిరిగిరండి.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ కంపెనీలు డెడ్ లైన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో H-1B , H-4 వీసాలకు సంవత్సరానికి లక్ష డాలర్లు రుసుము విధించబడింది. ఈ కారణంగా అమెరికాలో పనిచేయే భారతీయ, ఇతర విదేశీ నిపుణులు పెద్ద ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయిటర్స్ సమీక్షించిన అంతర్గత ఇమెయిల్ ప్రకారం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే అమెరికాలో ఉన్న H-1B, H-4 వీసాదారులకు సెప్టెంబర్ 21 గడువుకు ముందే తిరిగి అమెరికాకు రావాలని సూచించింది. కంపెనీ సూచన ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న H-1B ఉద్యోగులు భవిష్యత్తులో కూడా అక్కడే స్థిరపడుతూ పనిచేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది.
అమెరికన్లు తమ విదేశీ కార్యాలయాల ద్వారా పని చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ కూడా ఈ కొత్త H-1B విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నదని చూపుతుంది. మైక్రోసాఫ్ట్‌తో పాటు జేపీ మోర్గాన్ కూడా విదేశాల్లో పనిచేస్తున్న H-1B వీసాదారులను గడవుకు ముందే అమెరికాకు తిరిగి రావాలని సూచించింది.

ప్రస్తుతం, అమెజాన్, ఆపిల్, గూగుల్, మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలకు కూడా విదేశాల్లో వేలాది H-1B ఉద్యోగులు ఉన్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, వీరందరిని కూడా అమెరికాకు తిరిగి రాక తప్పనిసరి కావచ్చు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ఇప్పటికే వేలాది H-1B వీసాలు పొందాయి. 2025 ప్రథమార్థంలో అమెజాన్ AWS 12,000 కంటే ఎక్కువ H-1B వీసాలకు ఆమోదం పొందగా, మైక్రోసాఫ్ట్, మెటా ఒక్కొక్కటి 5 వేల కంటే ఎక్కువ ఆమోదాలను పొందాయి.
H-1B వీసా అనేది అమెరికాలోని కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి రూపొందించిన వీసా. దీన్ని మొదట 1990లో ప్రారంభించారు. ఈ వీసాలు సాధారణంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు మంజూరు అవుతాయి. భారతీయులు H-1B వీసాదారుల్లో 71% వాటా కలిగి ఉన్నారు.
కొత్త రుసుము ప్రభావం ప్రధానంగా భారతీయ ఉద్యోగులపై పడనుంది. కాగా టెక్ పరిశ్రమలోని దిగ్గజాలు ఈ నిర్ణయంపై ఇంకా పూర్తి స్పందన ఇవ్వలేదని రిపోర్ట్‌లు సూచిస్తున్నాయి. అయితే, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలు ఇప్పటికే తక్షణ చర్యలు సూచించడంతో.. భారతీయ IT నిపుణులు, ఇతర H-1B వీసా హోల్డర్లు ఇప్పుడు తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచంలో ప్రముఖ బ్యాకింగ్ దిగ్గజం JP మోర్గాన్ కంపెనీ కూడా తన H-1B వీసా ఉద్యోగులకు తక్షణ చర్యలను సూచించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం JP మోర్గాన్ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఒక అంతర్గత ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు సెప్టెంబర్ 21, ఉదయం 12:01am ET లోపు వెంటనే US కి తిరిగి రావాలని హెచ్చరిక జారీ చేశారు. ఈ ఇమెయిల్‌లో H-1B వీసా హోల్డర్లకు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Microsoft, JpMorgan కంపెనీలు ప్రస్తుతం అమెరికాలో ఉన్న H-1B ఉద్యోగులు తదుపరి మార్గదర్శకత్వం వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలను నివారించాలని సూచన ఇచ్చారు. ఈ చర్య ట్రంప్ పరిపాలన కొత్త ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ను అమలు చేయడానికి కంపెనీలు, ఉద్యోగులు సిద్ధమవుతున్న సందర్భంలో తీసుకోవడం జరిగింది.


Click it and Unblock the Notifications