AP Skill Development: గత వైకాపా సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ స్కామ్ జరిగిదని భారీగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభియోగాలు మోపింది. దీంతో ఆయన దాదాపు రెండు రోజుల వరకు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అయితే దీనికి నిరూపించే బలమైన సాక్ష్యాలు ఏమీ దొరకలేదు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలకు తిరిగి తావులేకుండా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
సర్కార్ ప్రస్తుతం ఏపీలో స్కిల్ సెన్సెస్ నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రి లోకేష్ దీనిపై అధికంగా ఫోకస్ కొనసాగిస్తున్నారు. ఇది రాష్ట్రాన్ని వేగంగా డెవలప్ చేసేందుకు దోహదపడుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈసారి జాతీయ అంతర్జీతీయ టెక్ సంస్థలను భాగస్వాములుగా చేర్చుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్ ఏపీ యువత భవితవ్యాన్ని తీర్చిదిద్దటంలో తమ వంతు సహకారాన్ని అందిస్తాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సర్టిఫికెట్లను స్కిల్ సర్వేతో లింక్ చేయనున్నట్లు సమాచారం.

ఈక్రమంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‍స్ట్రక్షన్ తన స్కిల్ సెంటర్ ఏపీ రాజధాని నగరం అమరావతిలో ఏర్పాటు చేస్తుందని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రైమరీ టాబ్యులేషన్ నిర్వహిస్తుందని, మైక్రోసాఫ్ట్ ఐబీఎం స్కిల్ ఎడ్యుకేషన్ అందించటంలో భాగమౌతాయని తెలుస్తోంది. అలాగే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణ రంగంలో అవసరమైన నైపుణ్యాలను అందించటం వారికి ట్రైనింగ్ ఇవ్వటానికి ఎల్ అండ్ టి ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, నిర్వహణకు సంబంధించి రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది.
గతంలో స్కిల్ స్కామ్ వివరాలు..
ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 50 రోజులకు పైగా జైలు జీవితాన్ని గడిపారు. రూ.371 కోట్ల మేర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో అవినీతి జరిగిందని అప్పటి ఏపీ సీఐడీ అధికారులు దర్యాప్తులో ఆరోపించారు. అయితే చివరికి అక్టోబర్ 31, 2023న జైలు నుంచి బెయిల్‌పై చంద్రబాబు రిలీజ్ అయ్యారు. చార్జిషీట్‌లో చెప్పిన డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులకు చెందిన రూ.23.5 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేయడానికి ఈడీ హైదరాబాద్ యూనిట్ మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని అమలు చేసింది. సీమెన్స్ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం పెట్టిన డబ్బు కొన్ని షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించబడిందని అప్పట్లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications