America: అమెరికా నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ ఆందోళన.. ఇలా అయితే భారతీయులంతా వెళ్లాల్సిందేనా..!
అమెరికా ప్రభుత్వం విదేశీయుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న విదేశీ ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. అక్కడి ప్రభుత్వం హెచ్ 1బీ వీసాలపై తీవ్ర ఆంక్షలు విధించింది. పలు కంపెనీలకు చర్యలు తీసుకుంది. భారత్ కంపెనీలే కాకుండా స్థానిక కంపెనీలపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ పై కూడా చర్యలు తీసుకున్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్ కూడా స్పందించింది. తాజాగా ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా మాట్లాడారు. గ్రీన్ కార్డుల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు.
విదేశీ ఉద్యోగులకు అమెరికాలో శాశ్వతంగా స్థిరపడే అవకాశాలను తగ్గిస్తే.. భవిష్యత్తులో టెక్నాలజీ రంగం నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకుంటాయని.. ప్రభుత్వం నిర్ణయం వల్ల వారంతా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు నైపుణ్యం గల ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుందని బ్రాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రో సాఫ్ట్ కంపెనీ హెచ్ 1బీ వీసాలను దుర్పినియోగం చేసిందని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపణలపై కూడా బ్రాడ్ స్మిత్ స్పందించారు. వాన్స్ ఆరోపణలను ఖండించారు.

తమ కంపెనీ విదేశీ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇస్తుందనే వాదనను కూడా ఆయన ఖండించారు. ఉద్యోగి ఏ దేశానికి చెందినవారైనా వారి ఇమ్మిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా ఒకే విధమైన వేతన వ్యవస్థను అనుసరిస్తామని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ గత ఏడాది 9,000 మందికి పైగా అమెరికాలో జన్మించిన ఉద్యోగులను నియమించుకుందని స్మిత్ గుర్తు చేశారు. విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నామనే కారణంతో అమెరికా పౌరులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావించడం సరికాదని బ్రాడ్ స్మిత్ వాదించారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయంతో ఎక్కువగా భారతీయులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా చర్యలతో అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. భారతీయులు ఇప్పుడు పై చదువుల కోసం యూరప్ దేశాలు వెళ్తున్నారు. అక్కడున్న భారతీయులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది స్వదేశం రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications