For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bill Gates: బిల్ గేట్స్ కు భారత కోర్టు నోటీసులు.. ఆ విషయంలో ప్రతివాదిగా.. నష్టపరిహారం..

|

Bill Gates: అమెరికా దిగ్గజ వ్యాపారవేత్త బిల్ గేట్స్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన కుమార్తె కరోనా టీకా వల్లే మరణించిందంటూ ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ తరుణంలో.. బిల్ గేట్స్, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII), డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (DGCI), మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆరోపణ ఏమిటంటే..

ఆరోపణ ఏమిటంటే..

తన కుమార్తె మరణానికి 'వ్యాక్సిన్ డెత్' కారణమంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వవలసిందిగా బాంబే హైకోర్టు పైన పేర్కొన్న వారికి నోటీసులు జారీ చేసింది. ఆ వ్యక్తి తన అభ్యర్థనలో కుమార్తె మరణానికి కోవిషీల్డ్‌ టీకా కారణమంటూ నిందించాడు. భారతీయ వ్యాక్సిన్ తయారీదారు నుంచి రూ.1,000 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేశాడు.

బిల్ గేట్స్ కు నోటీసులు..

బిల్ గేట్స్ కు నోటీసులు..

సదరు వ్యక్తి అభ్యర్థనపై సమాదానం చెప్పాలంటూ కోర్టు బిల్ గేట్స్, సీరమ్ ఇన్స్టిట్యూట్, DGCI బాంబే HC నోటీసు అందుకుంది. దీంతో ప్రపంచ కుబేరుడి పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. పిటిషనర్ దిలీప్ లున్వత్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ ఈ పిటిషన్‌పై ప్రతివాదులుగా చేర్చబడ్డారు. ఆగస్టు 26న పిటిషన్‌లోని ప్రతివాదులందరికీ న్యాయమూర్తులు ఎస్వీ గంగాపూర్వాలా, మాధవ్ జామ్దార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది.

 వైద్య విద్యార్థిని..

వైద్య విద్యార్థిని..

వైద్య విద్యార్థిని అయిన తన కుమార్తె స్నేహల్ లునావత్ ఆరోగ్య కార్యకర్త కావడంతో జనవరి 28, 2021న నాసిక్‌లోని తన కళాశాలలో SII తయారు చేసిన యాంటీ-కరోనావైరస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ఒత్తిడి చేశారని సదరు వ్యక్తి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

వికటించిన టీకా..

వికటించిన టీకా..

టీకా తీసుకున్న కొన్ని రోజుల తర్వాత.. స్నేహల్‌కు తీవ్రమైన తలనొప్పి, వాంతులు వచ్చాయి. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె మెదడులో రక్తస్రావం జరిగిందని వైద్యులు చెప్పినట్లు పిటిషన్‌లో ఆమె తండ్రి పేర్కొన్నారు. చికిత్స పొందుతూ స్నేహల్ మార్చి 1, 2021న మరణించింది. వ్యాక్సిన్ వల్ల కలిగిన దుష్ప్రభావాలే తన కుమార్తె మరణానికి కారణమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రూ.1000 కోట్ల పరిహారం..

రూ.1000 కోట్ల పరిహారం..

అక్టోబరు 2, 2021న కేంద్ర ప్రభుత్వం ప్రతికూల సంఘటనలు అనుసరించే ఇమ్యునైజేషన్ (AEFI) కమిటీ సమర్పించిన నివేదికపై పిటిషన్ ఆధారపడింది. ఇది కోవిషీల్డ్ దుష్ప్రభావాల వల్ల తన కుమార్తె మరణానికి కారణమని అంగీకరించింది. దీంతో భారత్ లో టీకా తయారు చేస్తున్న సీరమ్ ఇన్టిట్యూట్ నుంచి రూ.1,000 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తూ బాధిత తండ్రి కోర్టును ఆశ్రయించాడు.

English summary

Bill Gates: బిల్ గేట్స్ కు భారత కోర్టు నోటీసులు.. ఆ విషయంలో ప్రతివాదిగా.. నష్టపరిహారం.. | Microsoft founder Bill Gates get Bombay High Court notice over alleged vaccine death

Microsoft founder Bill Gates get Bombay High Court notice over alleged vaccine death
Story first published: Saturday, September 3, 2022, 9:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X