మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లపై ఉద్యోగులు ఫైర్.. సంతోషించాల్సిన మెసేజ్ చూసి సీన్ రివర్స్
Microsoft: ఈమధ్య మైక్రోసాఫ్ట్ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. మొన్న అధినేత బిల్ గేట్స్, ఇవాళ CEO సత్య నాదెళ్ల వల్ల కంపెనీ పేరు వార్తల్లో నిలిచింది. సంచలనం సృష్టిస్తోన్న ChatGPTలో పెట్టుబడి కారణంగా మంచి వృద్ధిని నమోదు చేసిన ఆనందంలో టాప్ మేనేజ్‌మెంట్ ఉంది. కానీ లేఆప్స్, వేతనాల పెంపుదల నిలిపివేత పట్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
FY23కు గాను మైక్రోసాఫ్ట్ సాధించిన విజయాల పట్ల CEO సత్య నాదెళ్ల హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత మెసేజ్ పంపించారు. ఇది కంపెనీకి 'ల్యాండ్ మార్క్ ఇయర్'గా పేర్కొన్నారు. సంస్థ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఉద్యోగుల సృజనాత్మకత, ఆవిష్కరణల వల్ల బలమైన వృద్ధిని సాధించామంటూ సిబ్బందిని ప్రశంసించారు.

అయితే ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. సంతోషించాల్సిన ఉద్యోగులు కాస్తా CEOకు షాక్ ఇచ్చారు. వేతనాల పెంపును నిలిపివేయడం సహా 10 వేల మంది తొలగింపు ప్రకటనపై మండిపడ్డారు. కానీ యాక్టివిజన్ కొనుగోలు ఒప్పందం కోసం 69 బిలియన్ డాలర్లు వెచ్చించడాన్ని తప్పుపట్టారు.
'కష్టపడి కంపెనీ వృద్ధికి తోడ్పడినందుకు వేతనాల పెంపును నిలిపివేస్తూ కృతజ్ఞత చూపించడమే కరెక్ట్' అంటూ ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసినట్లు మీడియా సంస్థ వెల్లడించింది. ఈ వ్యాఖ్యకు 250కు పైగా అప్ వోట్స్ రావడం విశేషం. 'ఒకపక్క లక్షాధికారులైన అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్స్ లాభాలు ఆర్జిస్తుంటే, సిబ్బంది వేతనాల్లో మాత్రం కోత విధించడం దారుణం' అని మరో ఉద్యోగి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపింది.
సత్య నాదెళ్ల పోస్ట్‌పై మెజారిటీ సిబ్బంది సానుకూలంగా స్పందించారు. అయితే ఉద్యోగులు రాసిన 130 వ్యాఖ్యల్లో దాదాపు సగం ప్రతికూలంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో లీకైన అంతర్గత సర్వేలోనూ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఒకవేళ ప్రత్యర్థి కంపెనీ నుంచి మంచి ఆఫర్ వస్తే, కేవలం 47 శాతం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు మాత్రమే కంపెనీతోనే కొనసాగుతామని తేల్చి చెప్పారట.


Click it and Unblock the Notifications