Microsoft News: దాదాపు మూడేళ్లుగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే దిగ్గజ సంస్థలు కూడా ఎప్పుడు లేఆఫ్స్ ప్రకటిస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారితో సరిపెట్టకుండా పలు రౌండ్స్‌లో ఉద్యోగాల కోతను నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సిబ్బందికి బ్యాడ్ న్యూస్ చెప్పింది.
తన వర్క్‌ఫోర్స్‌ను క్రమబద్ధీకరించడానికి కొనసాగుతున్న ప్రయత్నంలో భాగంగా మైక్రోసాఫ్ట్ మరో రౌండ్ తొలగింపులను ప్రారంభించింది. బాధిత ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని వివిధ టీమ్స్ ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. తొలగించబడిన వారు లింక్డ్‌ఇన్‌లో పోస్టులు పెడుతున్నట్లు గీక్‌వైర్ (Geekwire) నివేదించింది.

శ్రామిక శక్తి సర్దుబాట్లు అనేవి వ్యాపార నిర్వహణలో అవసరమైన మరియు క్రమమైన భాగమని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి వివరించారు. ఉద్యోగుల తొలగింపులు ఉన్నప్పటికీ, కంపెనీ భవిష్యత్ వృద్ధితో పాటు కస్టమర్‌లు మరియు భాగస్వాములకు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తామని తెలిపారు. అందుకు అనుగుణంగా అవసరమైన చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్దమని స్పష్టం చేశారు.
ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది పలు రౌండ్లు లేఆఫ్స్ ప్రకటించింది. జనవరిలో తన గేమింగ్ విభాగం నుంచి దాదాపు 2 వేల మందికి ఉద్వాసన పలికింది. గత నెలలో అజూర్ క్లౌడ్ యూనిట్ మరియు హోలోలెన్స్ మిక్స్డ్-రియాలిటీ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో సుమారు వెయ్యి ఉద్యోగాల్లో కోత విధించింది. కంపెనీ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు అయిన యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 69 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన అనంతరం ఈ తొలగింపులు జరిగినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications