మైక్రోసాఫ్ట్ సర్వర్లపై మరోసారి సైబర్ అటాక్స్.. జూన్ ప్రారంభంలో సర్వీస్ అవుటేజ్ కారణం ఇదే!
Microsoft: ఈనెల ప్రారంభంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన కొన్ని సర్వీసులకు అంతరాయం కలిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అలా జరిగి ఉంటుందని అందరూ భావించారు. కానీ విషయం అది కాదని కంపెనీయే స్వయంగా ప్రకటించింది. వారంపాటు తమ సర్వర్లపై సైబర్ దాడులు జరిగాయని, అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారం సైతం ప్రభావితమైనట్లు ధృవీకరించింది.
సైబర్ అటాక్‌ల ఫలితంగానే ఈ నెల ప్రారంభంలో తన కంపెనీకి చెందిన కొన్ని సేవలు ప్రభావితం అయినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించినట్లు ఓ ప్రముఖ వార్తాసంస్థ నివేదించింది. అందువల్లనే పలువురు వినియోగదారులు అప్పుడు అంతరాయాలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అయితే కస్టమర్స్ డేటా లీక్ అయినట్లు మాత్రం ఎటువంటి ఆధారాలు లేనట్లు తెలుస్తోంది.

"జూన్ 2023 ప్రారంభంలో కొన్ని మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో విపరీతమైన ట్రాఫిక్ పెరుగుదలను గుర్తించాం. అందువల్ల సాధారణంగా అందుబాటులో ఉండే లభ్యత ప్రభావితం అయింది" అని కంపెనీ ఓ బ్లాగ్ పోస్ట్‌లో వివరణ ఇచ్చింది. ఘటనను స్టార్మ్-1359గా కంపెనీ నమోదుచేసింది. ఈ DDoS యాక్టివిటీపై మైక్రోసాఫ్ట్ దర్యాప్తు ప్రారంభించిందని వెల్లడిచింది.
ఈ నెల 5న టీమ్స్ మరియు ఔట్‌లుక్‌తో సహా మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ సూట్‌లు ఈ అటాక్ వల్ల ప్రభావితమయ్యాయి. వెయ్యి కంటే ఎక్కువ మంది వినియోగదారులకు ఈ సర్వీసులు 2 గంటలకు పైగా పని చేయబడలేదు. మరుసటి రోజు ఉదయం సైతం కొంతవరకు ఇదే పరిస్థితి తిరిగి పునరావృతమైంది. కాగా ఈ ఏడాదిలో మైక్రోసాఫ్ట్ సేవలకు ఇలా అంతరాయం ఏర్పడటం నాలుగోసారి కావడం విశేషం.


Click it and Unblock the Notifications