Tips to Techies: ప్రపంచ కుబేరుడు అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యజమాని బిల్ గేట్స్. ఆయన తన జీవితంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఉంటారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలకు వచ్చే అనేక మందిని గమనించే ఉంటారు. అయితే ఆయన టెక్కీలకు ఉపయోగపడే కీలకమైన విషయాన్ని బయటపెట్టారు.
ఒక్కో ఉద్యోగానికి వేల మంది పోటీపడుతున్న ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్వ్యూలో నరాలు తెగిపోయే ఒత్తిడి ఉంటుంది. అయితే గేట్స్ ఒక మాక్ ఇంటర్వ్యూ దృష్టాంతంలో మైక్రోసాఫ్ట్‌లో స్థానానికి దరఖాస్తు చేసుకునే జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చేపట్టారు. ఇందులో వేతనం గురించి చర్చ నుంచి అసలు నిన్నే అభ్యర్థిగా మైక్రోసాఫ్ట్ ఎంచుకోవాలో వరకు అనేక ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ క్రమంలో గేట్స్ మాక్ ఇంటర్వ్యూలో అతని జీతం అంచనాల గురించి అడిగినప్పుడు, ఆప్షన్ ప్యాకేజీ మంచిదని తాను ఆశిస్తున్నట్లు బదులిచ్చారు. తాను రిస్క్ తీసుకోగలుగుతానని, కంపెనీకి గొప్ప భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ నగదు పరహారం కంటే ఎక్కువ స్టాక్ ఆప్షన్లలను పొందాలని భావిస్తానని పేర్కొన్నారు. వాస్తవానికి తక్షణ నగదు పరిహారం కంటే ఇది దీర్ఘకాలంలో భారీ విలువతో కూడిన సంపదను తెచ్చిపెడుతుందన్నారు. ఇక్కడ గేట్స్ కంపెనీ భవిష్యత్తుపై తన విశ్వాసాన్ని ప్రదర్శించారు.

శాలరీ డిస్కషన్ ఇలా చేయటం ఇంటర్వ్యూలో హాజరైన టెక్కీ నిబద్ధత స్థాయిని చూపడమే కాకుండా, కంపెనీ విజయంపై స్వార్థ ఆసక్తితో ముందుకు ఆలోచించే వ్యక్తిగా అభ్యర్థిని ఉంచుతుంది. అలాగే బయట కొన్ని కంపెనీలు చాలా ఎక్కువగా చెల్లిస్తున్నాయని తాను విన్నట్లు ఇంటర్వ్యూలో గేట్స్ పేర్కొన్నారు. ఇలా చేయటం ద్వారా జీతం డిమాండ్‌ను స్పష్టంగా పేర్కొనకుండా తన విలువను తెలియజేసాడు. ఈ ఆలోచనాత్మక విధానం ఉద్యోగ అన్వేషకులకు కీలకమైన టేకావే, విశ్వాసంతో చర్చలు జరపడం ముఖ్యమని గేట్స్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో గేట్స్ ఊహాజనితమైన ఇంటర్వ్యూలో కంపెనీలు అడిగే మరో ప్రశ్న మేము మిమ్మల్నే ఎందుకు ఈ ఉద్యోగానికి నియమించుకోవాలి అనే దానిపై కూడా తనదైన శైలిలో బదులిచ్చారు.
గేట్స్ తన మాక్ ఇంటర్వ్యూలో మేము మిమ్మల్ని ఎందుకు నియమించుకోవాలి? అనే ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ఇందులో భాగాంగా ముందు ఆయన తన సాంకేతిక నైపుణ్యాల గురించి చర్చించటం ప్రారంభించారు. నేను వ్రాసిన కోడ్‌లను మీరు చూడాలి. నేను తీసుకున్న అన్ని తరగతులకు మించి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను వ్రాస్తాను. నేను కాలక్రమేణా మెరుగయ్యానని అనుకుంటున్నాను, కాబట్టి నేను అక్కడ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉన్నానో చూడండి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తన వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి సారించడం ద్వారా, గేట్స్ నిరంతర అభివృద్ధి కోసం తన నిబద్ధతను నొక్కిచెప్పారు. వాస్తవానికి రిక్రూటర్లకు ఇది చాలా విలువైన అంశం. అంటే అభ్యర్థులు తాము ఎందుకు ఉద్యోగానికి సరైన ఎంపిక అనే విషయాన్ని ఇంటర్వ్యూ సమయంలో మార్కెటింగ్ చేసుకోవాలని గేట్స్ సూచించారు.
గేట్స్ ప్రకారం అత్యంత తెలివైన అంశం ఏమిటంటే.. ఎదుగుదల, వ్యక్తిగత అభివృద్ధిని ప్రతిబింబించడానికి టెక్కీలు సుముఖంగా ఉండటమేనన్నారు. ఇంటర్వ్యూలో విశ్వాసంతో కూడిన సమాధానాలతో పాటు తమకు పట్టున్న కోడింగ్ ఇతర అంశాలను మెరుగుపరుచుకున్నట్లు చెప్పటం రిక్రూటర్లను ఆకట్టుకునే అంశంగా ఉంటుందని గేట్స్ అన్నారు. అలాగే వ్యక్తులు టీం వర్క్ గురించి మంచి అభిరుచిని కలిగి ఉండటం కార్పొరేట్ ప్రపంచంలో కంపెనీలు కోరుకునే కీలకమైన లక్షణం. దీని గురించి కూడా అభ్యర్థులు హైలైట్ చేయాలి. ఇతరులతో సమర్ధవంతంగా పని చేసే సామర్థ్యం, పెద్ద మిషన్‌కు సహకరించడం కూడా అంతే ముఖ్యంగా కంపెనీలు ఒక అభ్యర్థిలో గమనించే ప్రావీణ్యాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఉద్యోగాన్ని ఆశించి ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు ఒకసారి బిల్ గేట్స్ మాక్ ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానాలతో పాటు ప్రదర్శించిన విశ్వాసాన్ని తప్పక పరిశీలించటం టెక్కీలకు కెరీర్ లో దోహదపడుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications