AI: భవిష్యత్తుపై బిల్‌గేట్స్ మైండ్ బ్లోయింగ్ అంచనాలు.. ప్రతి ఇంట్లో చిట్టి రోబోలు కామన్!
AI: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడిగా, గొప్ప దాతగా అమెరికన్ వ్యాపారవేత్త బిల్ గేట్స్ దాదాపు అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం గురించి ఆయన కొన్ని అంచనాలు వేశారు. భవిష్యత్తులో AI అభివృద్ధిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సమీప భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ రోబోట్ ఏజెంట్ ని కలిగి ఉంటారని బిల్ గేట్ల్ భావిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. దాని ప్రకారం.. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు కీలకం కానున్నట్లు ఆయన చెప్పారు. AI ఆధారంగా పనిచేసే వ్యక్తిగత సహాయకులు అందుబాటులోకి వస్తారన్నారు.

ఇప్పటికీ సాఫ్ట్ వేర్ రంగం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. అయితే రానున్న ఐదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని అంచనా వేశారు. రోజో ఏజెంట్స్ చాలా తెలివిగా, చురుకుగా ఉంటాయన్నారు. ఏదైనా అడగడానికి ముందే అవి మనకు సూచనలు చేసే సత్తా వాటికి ఉంటుందన్నారు.
బిజినెస్ ఐడియాలకు, కంపెనీలు తమ ఉద్యోగులను నేరుగా సంప్రదించడానికి ఏజెంట్లు సహాయం చేయగలవన్నారు. ఇవి ప్రతి సమావేశంలోనూ భాగంగా ఉంటూ.. పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలవని అభిప్రాయపడ్డారు. మానవ జీవితంలోని ఏ పనినైనా సులువుగా పూర్తిచేసేయగలవని తెలిపారు.
OpenAI సృష్టించిన ChatGPT, Microsoftకు చెందిన Bing, Google Bard మరియు Elon Musk Grok వంటి కొత్త AI ప్లాట్‌ఫారమ్‌లు ఆవిర్భవించడంతో గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం ఉత్పాదకత సాధనాలుగా మాత్రమే కాకుండా మరింత ఎక్కువ చేయగలవని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications