Microsoft Xbox: ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చితుల మధ్య నాన్ స్టాప్‌గా లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. చిన్న కంపెనీల దగ్గర నుంచి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల వరకూ అన్నీ ఉద్యోగులపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాయి. ఖర్చుల తగ్గింపు సాకుతో సమర్థించుకుంటున్నప్పటికీ కొత్త సాంకేతికతలపై వెచ్చించేందుకు మాత్రం వెనకాడటం లేదు.
నిన్న ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా భారీ సంఖ్యలో తన సిబ్బందికి ఉద్వాసన పలికింది. మరుసటి రోజే మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తొలగిస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. ప్రసిద్ధ ఆర్కేన్ ఆస్టిన్‌తో సహా అనేక గేమింగ్ స్టూడియోలను మూసివేయడానికి ఎక్స్‌బాక్స్ సిద్ధమైంది. గేమింగ్ రంగంలో ఏర్పడిన మందగమనం వల్ల కంపెనీలో భారీ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

'హై-ఫై రష్'ను సృష్టించిన టోక్యోకు చెందిన టాంగో గేమ్‌వర్క్స్ మరియు కెనడా బేస్డ్ ఆల్ఫా డాగ్ లు మూసివేతను ఎదుర్కొంటున్న స్టూడియోలలో ఉన్నాయి. ఈ మేరకు ఎక్స్‌బాక్స్ గేమ్ స్టూడియోస్ హెడ్ మాట్ బూటీ తన అంతర్గత మెమోలో స్పష్టం చేశారు. అయితే లేఫ్స్ వల్ల ప్రభావితమవుతున్న ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్యను మాత్రం వెల్లడించలేదని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
తమ గేమ్ పోర్ట్‌ఫోలియోకు మద్ధతు ఇస్తూ, కొత్త వాటిని పెంపొందించడానికి వనరులు తిరిగి కేటాయించబడతాయని మాట్ బూటి తెలిపారు. ఇందుకు అనుగుణంగా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి ఈ నిర్ణయం సహాయపడుతుందని వెల్లడించారు. గేమింగ్ సెక్టార్‌లో ఆవిష్కరణలు మరియు భవిష్యత్ వృద్ధికి మైక్రోసాఫ్ట్ నిబద్ధతకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
నిజానికి యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ కంటెంట్ మరియు సేవల విభాగం 62% పెరుగుదలను నమోదుచేసింది. కాబట్టి ఎక్స్‌బాక్స్ నష్టాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గేమింగ్ సెక్టార్‌లో ఈ విధమైన తొలగింపులు ఇదే మొదటిసారి కాదు. టేక్-టూ ఇంటరాక్టివ్ గత వారం రెండు అనుబంధ స్టూడియోల మూసివేతను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ కూడా ఎక్స్‌బాక్స్‌లో 1,900 మందికి ఉద్వాసన పలికింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications