AI: ఏఐపై కంపెనీలకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల హెచ్చరిక..
ప్రపంచంలో ఏఐ విప్లవంతో చాలా మార్పులు వస్తున్నాయి. చాలా కంపెనీలు ఏఐ వైపు అడుగులు వేస్తున్నాయి. చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నాయి. ఏఐ వాడుతున్న కంపెనీలకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల స్పందించారు. ఏఐ వాడుతున్న కంపెనీలు డబ్బు మాత్రమే ఖర్చు చేయడం లేదని.. వారికి తెలియకుండానే తమ సంస్థ సంస్థాగత జ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడుతున్నందుకు పలు కంపెనీలు రెండుసార్లు చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇందులో ఒకటి డబ్బుతో, మరొకటి వ్యాపార పరిజ్ఞామని వివరించారు. ఏఐ ద్వారా అద్భుతంగా పని చేయాలంటే.. కంపెనీలు తమ వ్యాపార రహస్యాలు, పని విధానం, వారి రహస్య సమాచారాన్ని కూడా ఏఐలో పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో పలు కంపెనీలు తమకు తెలియకుండానే తమ సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయని వివరించారు. నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త కెన్నెత్ ఆరో ప్రతిపాదించిన Information Paradox ను నాదేళ్ల గుర్తు చేశారు.

ఏఐ యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కొనుగోలుదారుడు సమాచారం విలువ తెలుసుకోవడానికి దానిని పొందాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఏఐ ఉపయోగించాలంటే కంపెనీలే తమ విలువైన జ్ఞానాన్ని ముందుగా పంచుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఉద్యోగులు ఏఏఐకు ఇచ్చే ప్రతి ప్రాంప్ట్, తప్పులను సరిదిద్దేందుకు ఇచ్చే ఫీడ్ బ్యాక్ అన్ని స్టోర్ అయి ఉంటాయని హెచ్చరించారు. సమాచారాన్ని తెలియకుండానే ఇతర ఏఐ ఉపయోగించేలా పరిస్థితి మారాలని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో జరిగే సంభాషణ, ఉద్యోగుల ఫీడ్ బ్యాక్ మొత్తం కంపెనీ నియంత్రణలోనే ఉండాలని చెప్పారు. కంపెనీలు ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా ఉండాలన్నారు. అవసరానికి అనుగుణంగా ఇతర ఏఐ మోడళ్లు ఉపయోగించగల వ్యవస్థను కంపెనీలు రూపొందించాలన్నారు. ఇలా చేస్తే డేటాపై పూర్తి నియంత్రణ ఉండటమే కాకుండా, ఖర్చులు తగ్గడంతో పాటు ఒకే సంస్థపై ఆధారపడే పరిస్థితి కూడా నివారించవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఏఐ యుగంలో అసలు పోటీ కేవలం అత్యాధునిక మోడళ్ల నిర్మాణంలో కాదని, ఏఐని ఉపయోగించే సమయంలో ఏర్పడే విలువైన సంస్థాగత జ్ఞానాన్ని ఎవరు సురక్షితంగా కాపాడుకుంటారనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications