Microsoft: పద్మభూషణ్ అందుకున్న మైక్రోసాఫ్ట్ సీఈవో.. సత్య నాదెళ్ల హామీ.. ఎంత ప్రేమంటే..
Satya Nadella: ప్రపంచ గతిని మార్చటంలో అమెరికా టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ పాత్ర ఉందనటంతో ఎలాంటి సందేహం లేని విషయం. వారి తీసుకొచ్చిన అనేక సాంకేతికలు ఆధునిక సమాజంలో ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసింది. ఈ క్రమంలో కంపెనీని ముందుకు నడిపే బాధ్యతలను 2014 ఫిబ్రవరిలో భారతీయుడైన సత్య నాదెళ్లకు అందాయి. ఈ స్థితిలో సత్య నాదెళ్లకు భారతదేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ వరించింది.

మైక్రోసాఫ్ట్ CEO..
యూఎస్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు భారత అత్యున్నత పురస్కారాల్లో ముడోదైన పద్మభూషణ్ లభించింది. డాక్టర్ డి.వి.నాగేంద్ర ప్రసాద్, జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సత్య నాదెళ్ల ఈ అవార్డును అందుకున్నారు.

సత్య నాదెళ్ల హామీ..
జనవరిలో భారత్‌కు రావాలనుకుంటున్న సత్య నాదెళ్ల.. ఈ అవార్డును అందుకున్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. తాను భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ ను మరింత అభివృద్ధి చెందేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

అవార్డు ఎంపిక..
ఈ ఏడాది పద్మభూషన్ అవార్డుకు ఎంపికైన 17 మందిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఒకరు కావటం గమనార్హం. తాను అందుకున్న ఈ గౌరవానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు భారత ప్రజలకు సత్య నాదెళ్ల తన కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో పెద్ద పరిశ్రమల నుంచి చిన్న పరిశ్రమల వరకు ప్రతిదానిలో డిజిటల్ సేవల విషయంలో మార్పులొస్తాయని అభిప్రాయపడ్డారు.

మైక్రోసాఫ్ట్ టెక్ పెట్టుబడులు..
భారతీయ వ్యాపార మార్కెట్‌పై దృష్టి సారించిన మైక్రోసాఫ్ట్ ఆసియా మార్కెట్లో తన వ్యాపారాన్ని అనేక విధాలుగా విస్తరిస్తోంది. రానున్న 10 సంవత్సరాల్లో డిజిటల్ టెక్నాలజీ అన్ని రంగాల్లో ముఖ్యమైనది కానున్నందున సాంకేతికత చాలా కీలకంగా మారనుంది. అందుకే మైక్రోసాఫ్ట్.. క్లౌడ్ సర్వీసెస్, టెక్ సర్వీసెస్, డేటా సెంటర్లు మొదలైన ఆధునిక టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది.


Click it and Unblock the Notifications