మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల 2025 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 96.5 మిలియన్ డాలర్లు సంపాదించారు. పదేళ్ల క్రితం CEOగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇది అతని అత్యధిక జీతం. కంపెనీ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు (AI) రంగంలో మైక్రోసాఫ్ట్ సాధించిన పురోగతిని చెప్పుకోవచ్చు. 58 ఏళ్ల నాదెళ్ల FY25లో జీతంలో 22 శాతం పెరుగుదల నమోదు చేశారు. గత ఏడాది అతను 79.1 మిలియన్ డాలర్లను సంపాదించారు.
ప్రాక్సీ ఫైలింగ్ ప్రకారం.. సత్య నాదెళ్ల, అతని నాయకత్వ బృందం మైక్రోసాఫ్ట్‌ను కృత్రిమ మేధస్సు రంగంలో స్పష్టమైన నాయకునిగా నిలబెట్టిన ఫలితంగా ఈ జీతం ఉందని బోర్డు పేర్కొంది. Satya Nadella పదవీకాలంలో.. జూన్ 30, 2025 నాటికి మైక్రోసాఫ్ట్ షేర్ల మొత్తం విలువ 1500 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 3.4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. జీతంలో దాదాపు 90 శాతం స్టాక్‌లో ఉండగా.. బేసిక్ జీతం 2.5 మిలియన్ డాలర్లు మాత్రమే.

ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్లలో 23 శాతం పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం Amazon వంటి పోటీదార్ల కంటే ఎక్కువ స్థిరమైన వృద్ధి రేటును సాధించింది. CEO పనితీరు ఆధారిత జీతం పరంగా 95 శాతం పైగా వార్షిక లక్ష్య పరిహారం పనితీరు ఆధారంగా ఉంది. నగదు ప్రోత్సాహకం (Cash Incentive) 70 శాతం ముందే నిర్ణయించిన ఆర్థిక లక్ష్యాలను చేరడం ఆధారంగా ఇవ్వబడుతుంది.
ఇక CFO అమీ హుడ్ 29.5 మిలియన్ డాలర్ల జీతం పొందగా.. మైక్రోసాఫ్ట్ వాణిజ్య విభాగానికి పదోన్నతి పొందిన జడ్సన్ ఆల్థాఫ్ 28.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. FY24లో నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం జీతంలో 71.2 మిలియన్ డాలర్లు స్టాక్ అవార్డులు కాగా , 5.2 మిలియన్ డాలర్లు 'నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్'గా ఉన్నాయి. 169,791 డాలర్లు ఇతర పరిహారాలుగా ఉన్నాయి.
నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరి.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, క్లౌడ్ & ఎంటర్‌ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సర్వర్ & టూల్స్ ప్రెసిడెంట్, ఆన్‌లైన్ సర్వీసెస్ డివిజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంటి అనేక పదవులను నిర్వర్తించారు. 3 దశాబ్దాల పైగా అతను కంపెనీతో పని చేస్తున్నారు. అయినా 96.5 మిలియన్ డాలర్ల జీతం తో నాదెళ్ల అమెరికాలో అత్యధిక జీతం పొందుతున్న CEO కాదు. కోహెరెంట్ CEO జిమ్ ఆండర్సన్ 2024లో 101.4 మిలియన్ డాలర్లు సంపాదించి 9 అంకెల జీతంతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆండర్సన్ జీతంలో 90 శాతం పైగా దీర్ఘకాలిక ఈక్విటీ అవార్డుల రూపంలో వచ్చింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications