ఇంతకాలం పాకిస్తాన్‌లో టెక్నాలజీకి ఊపు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్, ఇప్పుడు అక్కడ తన దుకాణం మూసేసింది. 25 ఏళ్లుగా అక్కడ పనిచేసిన ఈ టెక్ దిగ్గజం, ఒక్కసారిగా "బై బై" చెప్పేసింది. ఇది అక్కడి టెక్ రంగంకి ఆశ్చర్యం కలిగించే విషయమే. మైక్రోసాఫ్ట్ లేకుండా పాకిస్తాన్ టెక్ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూడాలి!

మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్తాన్‌లో గత 25 ఏళ్లుగా కార్యకలాపాలు సాగించింది. 2000లో మొదలైన ప్రయాణం 2025లో ఆగిపోయింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ తమ పాకిస్తాన్ రీజినల్ ఆఫీస్‌ని పూర్తిగా మూసివేసింది. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో ప్రభుత్వ శాఖలతో కలిసి ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులు, విద్యా రంగంలో డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్లు అమలు చేసింది. దేశంలో ఆధునిక ఐటీ ప్రమాణాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
ఇటీవల పాకిస్తాన్ ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా లేని పాలసీలు, ఫారెక్స్ సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇలా చాలా విషయాలు టెక్ కంపెనీలను వెనక్కి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ వ్యూహాలను తిరిగి ఆలోచిస్తూ, ఖర్చులను తగ్గించడంలో భాగంగా కొన్ని దేశాలలో కార్యాలయాల మూసివేతను నిర్ణయించింది.
ఒకప్పుడు ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న ప్రాంతాల్లోనే మైక్రోసాఫ్ట్ సేవలందించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. క్లౌడ్ టెక్నాలజీ, రిమోట్ మోడల్స్ వచ్చాక అధికంగా ఫిజికల్ ఆఫీసుల అవసరం తగ్గింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తన సేవలను "అధికారిక భాగస్వాములు (certified partners)" ద్వారా అందిస్తోంది. ఇలా సంస్థ స్వయంగా కార్యాలయాలు నిర్వహించకపోయినా, సేవలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని వారు చెబుతున్నారు.
పాకిస్తాన్‌లోని ఐటీ వర్గాల్లో ఈ నిర్ణయం కొంత నిరాశను కలిగించింది. ''ఇది కేవలం ఉద్యోగం కోల్పోవడమే కాదు పాత పేజీ మూసుకున్నట్టుంది,'' అంటూ కొందరు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సోషల్ మీడియాలో స్పందించారు. దేశం నుంచి మరో గ్లోబల్ బ్రాండ్ వెళ్లిపోవడం, పెట్టుబడులపై ప్రభావం చూపుతుందనేది కూడా ఒక ఆందోళన.
మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజం నిష్క్రమణ తర్వాత, ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా తమ వ్యాపార వ్యూహాలను పునర్విమర్శించే అవకాశం ఉంది. అదే సమయంలో, స్థానిక కంపెనీలు, స్టార్ట్-అప్స్ ఈ ఖాళీని పూరించేందుకు ప్రయత్నించవచ్చు.
మొత్తంగా చూస్తే, ఇది పాక్ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక లాంటి విషయమే. పాకిస్తాన్‌లో టెక్నాలజీ రంగంలో అవకాశాలు ఉన్నా, స్థిరమైన పాలసీలు, ఆర్థిక భద్రత, పారదర్శకత లేకపోవడమే గ్లోబల్ కంపెనీలు, పెట్టుబడిదారులు నమ్మకంతో ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం. స్థిరమైన పాలసీలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంటే, పాకిస్తాన్ టెక్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications