మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బిగ్ షాక్.. 3200 మందిని తీసేస్తున్నట్లు కీలక ప్రకటన.. ఎందులో అంటే..

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ వచ్చే ఏడాదిలోగా 3,200 మంది ఉద్యోగులను.. అంటే సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 20 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెట్టుబడులను పెంచేందుకు కంపెనీ చేపట్టిన విస్తృత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ వెల్లడించారు.

ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఆశా శర్మ.. తొలి దశలో 1,600 మంది ఉద్యోగులను వెంటనే తొలగిస్తున్నామని, మిగిలిన ఉద్యోగులపై చర్యలు 2026-27 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే సంస్థకు చెందిన నాలుగు గేమింగ్ స్టూడియోలను విక్రయించడంతో పాటు మరో స్టూడియోతో సంబంధాలను కూడా ముగించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

Microsoft layoffs Microsoft job cuts Xbox restructuring Xbox layoffs Microsoft gaming gaming division tech layoffs Microsoft news Xbox business Satya Nadella gaming industry workforce reduction technology news software industry Xbox business restructuring global layoffs employment news tech industry Microsoft jobs

ప్రస్తుతం ఎక్స్‌బాక్స్ వ్యాపారం ఆశించిన స్థాయిలో లాభదాయకంగా లేదని శర్మ అంగీకరించారు. ఇతర ప్రధాన గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, పబ్లిషింగ్ సంస్థలతో పోలిస్తే కంపెనీ 3 నుంచి 10 రెట్లు తక్కువ లాభాల మార్జిన్‌తో పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల కోత ఉద్యోగుల ప్రతిభ, పనితీరును ప్రతిబింబించేదిగా కాదని, సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని స్పష్టం చేశారు.

గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్న శర్మ.. ఎక్స్‌బాక్స్‌ను పూర్తిగా రీసెట్ చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. సంస్థ భవిష్యత్తు కోసం మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కంటెంట్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడం, ప్లాట్‌ఫారమ్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, బృందాల పని విధానాన్ని సరళీకరించడం ప్రధాన లక్ష్యాలని వివరించారు.

Also Read

సంస్థలో ప్రస్తుతం అధిక స్థాయిలో యాజమాన్య పొరలు ఉండటం వల్ల నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని, అందుకే మేనేజ్‌మెంట్ స్థాయిలను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే విక్రేతలపై చేసే ఖర్చును 50 శాతం వరకు తగ్గించనున్నట్లు వెల్లడించారు.

ఎక్స్‌బాక్స్ వ్యూహంలో మరో కీలక మార్పుగా.. మోజాంగ్, కింగ్ స్టూడియోలు ఇకపై నేరుగా సీఈఓకు నివేదించే విధంగా మార్పులు చేస్తున్నట్లు శర్మ చెప్పారు. ఈ రెండు స్టూడియోలు కంపెనీకి అత్యధిక నెలవారీ యాక్టివ్ ప్లేయర్లను అందిస్తున్నాయని, భవిష్యత్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

అలాగే సంస్థలో తొలిసారిగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) పదవిని ఏర్పాటు చేసి, ఆ బాధ్యతలను హెలెన్ చియాంగ్ కు అప్పగించారు. సంస్థలోని అన్ని వ్యాపార విభాగాలను ఒకే నిర్వహణ వ్యవస్థ కిందకు తీసుకురావడం, పెట్టుబడి నిర్ణయాలను వేగవంతం చేయడం, ఫలితాలపై స్పష్టమైన బాధ్యతను ఏర్పరచడం ఆమె ప్రధాన బాధ్యతలుగా ఉంటాయని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా AI రంగంలో పెట్టుబడులను పెంచుతున్న టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగాల కోతలను కొనసాగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజాలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించగా, ఎక్స్‌బాక్స్‌లో తాజా పునర్వ్యవస్థీకరణ కూడా అదే ధోరణిలో భాగంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+