Semiconductor: చిప్ మేకింగ్‌తో చైనాకు భారత్ చెక్.. అమెరికాతో కలిసి మాస్టర్ ప్లాన్ షురూ
Semiconductor: మాన్యుఫాక్చరింగ్ హబ్ గా, ప్రపంచ కర్మాగారంగా ఇప్పటివరకు చైనా ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చింది. కొన్ని రంగాల్లో ఏకచత్రాధిపత్యం వహిస్తూ, తను చెప్పిందే వేదం అంటూ పలు దేశాలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూసింది. అయితే డ్రాగన్ కుతంత్రాలకు భారత్ గండి కొట్టడం ప్రారంభించింది. తాజాగా భారత్ లో జరిగిన ఓ కార్యక్రమం చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
సెమీకండక్టర్స్ కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతూ వస్తోంది. సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపులు పెరిగిన వేళ.. సాధ్యమైనంత వరకు ఆ దేశం నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని ఇండియా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా US చిప్ మేకర్ మైక్రోన్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా గుజరాత్ లోని సనంద్ లో 2.75 బిలియన్ డాలర్ల యూనిట్ ను నెలకొల్పేందుకు పనులు ప్రారంభమయ్యాయి.

ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(GIDC) 93 ఎకరాల భూమిని కేటాయించింది. అసెంబ్లింగ్, టెస్టింగ్ తో పాటు ప్యాకేజింగ్(ATMP) కార్యకలాపాలు ఇక్కడ జరగనున్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్(ISM) కింద దీన్ని అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తున్నారు. 2024లో అందుబాటులోకి రానుండగా.. ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
'మొమరీ, స్టోరేజ్ సొల్యూషన్స్ పరిశ్రమలో మైక్రోన్ టెక్నాలజీ అగ్రగామి. అటువంటి గొప్ప కంపెనీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. కేవలం అత్యాధునిక సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ ప్లాంట్ ను నిర్మించడమే కాకుండా ప్రపంచ వేదికపై భారత్ సాంకేతిక నైపుణ్యానికి మేము పునాది వేస్తున్నాం' అని ప్లాంట్ నిర్మాణ కాంట్రాక్టును చేపట్టిన టాటా ప్రాజెక్ట్స్ MD&CEO వినాయక్ పాయ్ తెలిపారు.


Click it and Unblock the Notifications