Telangana Farm Loan Waiver: తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటన స్టాక్ మార్కెట్లను తాకింది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తీసుకుంటున్న చర్యలు కొన్ని ఫైనాన్స్ కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం రైతులకు రూ.2 లక్షల వరకు రైతులకు వ్యవసాయ రుణమాఫీ ప్రకటించడంతో మైక్రో ఫైనాన్స్ సంస్థల షేర్లు నేడు మార్కెట్లో దాదాపు 5 శాతం మేర నష్టపోయాయి. ఇదే క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం రుణమాఫీని రూ.40 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో మెుత్తం వ్యవసాయ రుణాల్లో ఈ సంస్థలు 0.7 శాతం, జార్ఖాండ్ లో 3 శాతం వరకు వాటాను కలిగి ఉన్నాయి. అలాగే 2024లో ఎన్నికల జరగనున్న మహారాష్ట్రలో వీటికి దాదాపు మార్చి 2024 నాటికి 8-10 శాతం వ్యాపార వాటా కలిగి ఉండటంతో అప్రమత్తంగా ఉన్నట్లు ఇన్‌క్రెడ్ ఈక్విటీస్ వెల్లడించింది.

నేడు ఇంట్రాడేలో ప్రభావితమైన షేర్లను గమనిస్తే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ 5.07 శాతం క్షీణించి రూ.45.91కి చేరుకుంది. క్రెడిట్ యాక్సిస్ గ్రామీన్ లిమిటెడ్ స్టాక్ ధర 4.33 శాతం పడిపోయి రూ.1047.25కి చేరుకుంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు 1.53 శాతం క్షీణతతో రూ.52.27 స్థాయికి చేరాయి. ఇక స్పూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్ 2.56 శాతం పడిపోయి రూ.732.20ని చేరుకోగా.. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు 3.03 శాతం పతనంతో రూ.195.20 స్థాయికి చేరుకున్నాయి. మైక్రో ఫైనాన్స్ సంస్థల లోన్స్ మెుత్తం తెలంగాణలో రూ.2,920 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.

2024 ఆర్థిక సంవత్సరం తెలంగాణలో 10 ఎంఎఫ్‌ఐలను కలిగి ఉండగా.. ఈ సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఒక్కటిగా ఉంది. ప్రస్తుతం ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ 22 శాఖలను కలిగి ఉండగా.. ఈక్విటాస్ SFB 20, క్రెడిట్ యాక్సెస్ 13గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications