గూగుల్ ఇంటర్న్ టు బిలియనీర్.. కేవలం 25 ఏళ్లకే రూ. 5 లక్షల కోట్ల డీల్‌తో ప్రపంచాన్ని షాక్ చేసిన యువకుడు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తోందో చెప్పడానికి రోజూ ఏదో ఒక సంచలన వార్త వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ చరిత్రలోనే మైండ్ బ్లాక్ అయ్యే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ బయటకు వచ్చింది. కేవలం 25 ఏళ్ల వయసున్న మైఖేల్ ట్రెల్ (Michael Truell) అనే యువకుడు సృష్టించిన కోడింగ్ స్టార్టప్‌ను.. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థ ఏకంగా 60 బిలియన్ డాలర్లకు (మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 5 లక్షల కోట్లు) కొనుగోలు చేసింది. జూన్ 16, 2026 న జరిగిన ఈ డీల్‌తో ఈ కుర్రాడు రాత్రికి రాత్రే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లలో ఒకడిగా నిలిచాడు.

Michael Truell SpaceX Cursor AI Acquisition 60 Billion Deal Elon Musk Tech News

ఎంఐటీ స్టూడెంట్ నుండి స్టార్టప్ ఫౌండర్ వరకు..

ఈ అద్భుత ప్రయాణం ఎలా మొదలైందంటే.. మైఖేల్ ట్రెల్18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ప్రఖ్యాత ఎంఐటీ (MIT) కాలేజీలో చదువుతూ.. పార్ట్‌టైమ్‌గా గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ చేశాడు. అక్కడ లాంగ్వేజ్ మోడల్స్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడే ప్రముఖ ఇన్వెస్టర్ అలీ పార్తోవి కంటిలో పడ్డాడు. మైఖేల్ కోడింగ్ టాలెంట్ చూసి ఫిదా అయిన ఆ ఇన్వెస్టర్.. ఫ్యూచర్‌లో ఇతను ఏ బిజినెస్ పెట్టినా కళ్లు మూసుకుని డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చని తన డైరీలో నోట్ రాసి పెట్టుకున్నాడట.

ఆ నమ్మకంతోనే 2022 లో మైఖేల్ తన కాలేజ్ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంఐటీ చదువును మధ్యలోనే ఆపేసి (డ్రాపౌట్ అయి) 'యానిస్ఫియర్' అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. మొదట్లో మెకానికల్ ఇంజనీర్ల కోసం ఏదో చేయాలనుకున్నారు కానీ, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం ఒక పవర్‌ఫుల్ AI టూల్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ ఆలోచన నుండి పుట్టిందే 'కర్సర్' (Cursor) అనే AI కోడింగ్ అసిస్టెంట్. స్టార్టప్ మొదలుపెట్టిన కొత్తలో మైఖేల్ రూపాయి కూడా జీతం తీసుకోకుండా రాత్రి పగలు కష్టపడ్డాడు.

కర్సర్ (Cursor) సృష్టించిన ప్రకంపనలు

2023 లో లాంచ్ అయిన ఈ కర్సర్ యాప్.. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు కోడింగ్ రాసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. చాలా ఈజీగా, వేగంగా కోడింగ్ రాయడం, తప్పులను సరిదిద్దడం (Debugging) చేయడంలో ఇది తోపు అనిపించుకుంది. దీని డిమాండ్ ఎలా పెరిగిందంటే.. లాంచ్ అయిన ఏడాదిలోనే 100 మిలియన్ డాలర్ల రెవెన్యూ దాటేసింది. 2026 నాటికి ఈ కంపెనీ ఏటా దాదాపు 2 నుండి 3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించే స్థాయికి ఎదిగింది.

ఈ కంపెనీలో కేవలం కొన్ని వందల మందే పని చేస్తున్నారు. కానీ ప్రపంచంలోని టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో మెజారిటీ కంపెనీలు (ఎన్విడియా, అడోబ్, శామ్‌సంగ్, సేల్స్‌ఫోర్స్ వంటి దిగ్గజాలు) తమ కోడింగ్ కోసం ఈ కర్సర్ టూల్‌నే వాడుతున్నాయి. దీని వెనుక ఉన్న క్రేజ్ చూసే ఓపెన్ఏఐ (OpenAI) స్టార్టప్ ఫండ్ కూడా ఇందులో భారీగా ఇన్వెస్ట్ చేసింది.

ఎలాన్ మస్క్ ఎందుకు కనెక్ట్ అయ్యాడు?

ఎలాన్ మస్క్‌కు చెందిన xAI అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి ఇలాంటి ఒక స్ట్రాంగ్ కోడింగ్ టూల్ అవసరం పడింది. అందుకే స్పేస్‌ఎక్స్ ద్వారా మొదట పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకుని.. ఆ తర్వాత ఈ కంపెనీని ఏకంగా రూ. 5 లక్షల కోట్ల ఆల్-స్టాక్ డీల్‌తో పూర్తిగా కొనేసింది. ఈ మెగా డీల్ ద్వారా మైఖేల్ ట్రెల్ సొంత ఆస్తి విలువ ఇప్పుడు ఫోర్బ్స్ ప్రకారం దాదాపు 1.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 10,000 కోట్లు) చేరింది.

నాలుగేళ్ల క్రితం కాలేజ్ డ్రాపౌట్ అయి, జీతం లేకుండా ఐడియాను నమ్ముకున్న ఒక కుర్రాడు.. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద AI సక్సెస్ స్టోరీగా నిలిచాడు. AI యుగంలో టాలెంట్, సరైన ఐడియా ఉంటే ఎంత వేగంగా బిలియనీర్లు అవ్వచ్చో చెప్పడానికి మైఖేల్ కథే ఒక నిదర్శనం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+