న్యూఢిల్లీ: మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు విదేశాల నుంచి నిధులను పొందడానికి ఉద్దేశించిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ రద్దు వ్యవహారంలో నెలకొన్న వివాదానికి కేంద్ర ప్రభుత్వం తెర దించింది. ఇటీవలే మదర్ థెరెస్సా ఛారిటీస్‌తో పాటు 6,000 స్వచ్ఛంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. విదేశాల నుంచి నిధుల పొందడానికి వీలుగా ఉన్న ఎఫ్‌సీఆర్ఏ యాక్ట్ లైసెన్స్‌ను రద్దు చేసింది. మొత్తం 12,580 ఎన్జీఓలకు లైసెన్స్ గడువు గత ఏడాది డిసెంబరు 31తో ముగిసింది. వాటిలో 5,789 ఎన్జీఓల లైసెన్స్‌ను కేంద్రం పునరుద్ధరించలేదు.
2020లో ఎఫ్సీఆర్ఏ చట్టంలో చేసిన సవరణలకు అనుగుణంగా 2021 డిసెంబరు 31లోగా వాటిని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తం 18,778 ఎన్జీవోలు లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా.. వాటిల్లో 12,989లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లో మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సహా పలు ఎన్జీఓల దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. డిసెంబరు 31తో గడువు పూర్తి కావడంతో 5,789 ఎన్జీఓలకు విదేశాల నుంచి నిధులు పొందే వీలు లేకపోయింది.
ఒక్స్‌ఫామ్ ఇండియా ట్రస్ట్, జామియా మిలియా ఇస్లామియా, హమ్‌దర్ద్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, డీఏవీ కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ సొసైటీ, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, జేఎన్‌యూ న్యూక్లియర్ సైన్స్ సెంటర్, ఇండియా హబిటట్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ట్యూబర్ క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహా అనేక సంస్థలు ఉన్నాయి. ఇందులో మదర్ థెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ కూడా ఉన్నాయి.

దీనిపై దేశంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదల కోసం సేవ చేస్తోన్న మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్‌కు విదేశాల నుంచి అందే నిధులను నిలిపివేసేలా కేంద్రం చర్యలు తీసుకోవడాన్ని పలువురు విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. ప్రతి అంశాన్నీ మతంతో ముడిపెట్టి చూస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. సేవా కార్యక్రమాలకు కూడా మతం రంగు పులమడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్‌కు విదేశీ నిధులు అందేలా ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పలు అభ్యర్థనలు, విజ్ఞప్తులు అందాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్‌కు ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications