CNG prices: సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వినియోగం నుంచి గ్యాస్, ఎలక్ట్రిక్ ఆధారిత ఇంధన యూసేజ్ కు మారాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా దేశీయంగా ఉత్పత్తి చేయిబడిన హై-ప్రెజర్ హై టెంపరేచర్ నేచురల్ గ్యాస్ ధరలను తగ్గించింది.
తన దేశీయ పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG) ధరలను తగ్గిస్తున్నట్లు మహానగర్ గ్యాస్ లిమిటెడ్(MGL) ప్రకటించింది. ఈ ధరలు అక్టోబర్ 1, 2023 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు తెల్పింది. అయితే చమురు మంత్రిత్వ శాఖ సహజవాయు ధరలు సవరించిన వెంటనే MGL రేట్లు తగ్గించడం గమనార్హం.

MGL సర్క్యలర్ ప్రకారం.. ముంబై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో CNG ధర కిలోకు 3/-, డొమెస్టిక్ PNG 2/- చొప్పున తగ్గింది. కాగా సవరించిన CNG ధరలు 76/kg, PNG ధర 47/SCM చొప్పున అక్టోబర్ 1 2023 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ముంబైలో ప్రస్తుత పెట్రోల్ ధరలతో పోలిస్తే 50 శాతం, డీజిల్ తో చూస్తే 20 శాతం తక్కువకే CNG లభిస్తోంది.
వంటింట్లో వినియోగించే LPG కంటే PNG చౌక ధరలో అందుబాటులో ఉన్నట్లు MGL తెలిపింది. పొదుపుకు తోడు భద్రత, విశ్వసనీయత, పర్యావరణ అనుకూలతలు మరో ప్లస్‌గా పేర్కొంది. కేంద్రం ధరల తగ్గింపును MGL స్వాగతించింది. సహజ వాయువు వినియోగాన్ని ఇది మరింత ప్రోత్సహిస్తుందని అంచనా వేసింది. త్వరలోనే ఈ తగ్గింపు ధరలు దేశం మొత్తానికి అందుబాటులోకి వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications