Metro Compensation Cheques: ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల నుంచి కంపెనీలు తన ఉత్పత్తి కేంద్రాలతో పాటు వ్యాపార కార్యకలాపాలను హైదరబాదు నుంచి నడిపేందుకు మెుగ్గుచూపుతున్న వేళ నగరం నిరంతరం రద్దీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనికి అనుగుణంగా రవాణా సదుపాయాలను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం సైతం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రో రైలు కనెక్టివిటీని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేజ్2 ప్లాన్ సిద్ధం చేసింది. ఈ క్రమంలో భాగంగా నగరంలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో మెట్రో రైలు విస్త్రరణకు కూడా ప్రణాళిక సిద్ధం చేయబడింది. అయితే దీనివల్ల ఆస్తులను కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహరానికి సంబంధించిన చెక్కులను సోమవారం సాయంత్రం అందించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు తాము దశాబ్ధాలుగా ఇదే ప్రాంతంలో నివశించామని, తమ ఆస్తులను వదులుకోవటానికి బాధగా ఉన్నప్పటికీ మెట్రో రైలు తమ ప్రాంతానికి కూడా వస్తున్నందున సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఈక్రమంలో చాలా మంది ప్రజలు 20 అడుగుల నుంచి దాదాపు 200 అడుగుల వరకు స్థలాన్ని కోల్పోయారని తెలుస్తోంది.

అభివృద్ధి కోసం తాము ఇందులో పాల్గొనటానికి ముందుకొచ్చామని ప్రాపర్టీ యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్కింగ్స్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో 34 ప్రాపర్టీలకు చెందిన 41 మంది యజమానులకు తాజాగా ప్రభుత్వం నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను అందజేసింది. ఈ క్రమంలో ఎంజీబీఎస్ నుంచి చంద్రయానగుట్ట ప్రాంతంలో 7.5 కిలోమీటర్ల కారిడార్ ప్రాంతంలోని ఓల్డ్ సిటీ ప్రజలకు రూ.20 కోట్ల విలువైన నష్టపరిహారం చెక్కులను అందించారు. ప్రస్తుత చర్యల ఓల్డ్ సిటీ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని ప్రాపర్టీ యజమానులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో మెట్రో నిర్మాణానికి సంబంధించిన పనులు నిలిచిపోయాయని అన్నారు. ప్రస్తుతం పనులను వేగవంతం చేయటంతో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో మెట్రో రాకకు అవసరమైన పూర్తి సహకారం తమ నుంచి ఉంటుందని వెల్లడించారు. ప్రతిపాదిత సాలార్ జంగ్, చార్మినార్ మెట్రో స్టేషన్లలో స్మారక చిహ్నాలకు స్కైవాక్‌లను నిర్మిస్తే అది పర్యాటకులకే కాకుండా స్థానికులకు కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు. అలాగే కొత్తగా రానున్న మెట్రో స్టేషన్లలో వ్యాపారాల ఏర్పాటులో నష్టపోయిన భూమి కోల్పోయిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications