Meta Warning: ఉద్యోగులకు మార్క్ మామ వార్నింగ్.. బయటకు లీకైన మెమో..
Meta Warning: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భారీ తొలగింపుల తర్వాత సరికొత్త నిర్ణయంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ కోసం కఠినంగా భారత కంపెనీల వ్యూహాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుత అస్థిక ఆర్థిక, వ్యాపార పరిస్థితుల్లో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను మెరుగైన పనితీరు కోసం తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని ఆదేశిస్తున్నాయి. ఇదే ప్రక్రియను మెటా కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు తమ రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాన్ని పాటించకుంటే.. తొలగింపుతో సహా కఠినమైన జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని మెటా హెచ్చరించింది.

'ఇన్-పర్సన్ టైమ్ పాలసీ' అని పిలువబడే మెటా హెచ్‌ఆర్ చీఫ్ లోరీ గోలెర్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలోని ఈ షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఇది టెక్ దిగ్గజం తన ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రావడానికి నిబంధనలను ఎలా కఠినతరం చేసిందో తెలియజేస్తోంది. దీని ప్రకారం.. సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానున్న అప్‌డేటెడ్ పాలసీ ప్రకారం ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులైనా కార్యాలయంలో ఉండాలని మెమో స్పష్టం చేసింది. దీనిని నిశితంగా పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.
దీనికి ఇష్టపడని ఉద్యోగులు కంపెనీ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మెటాలో 18 నెలల కంటే తక్కువ కాలం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు రిమోట్ వర్క్‌కు అర్హులు కారు. పూర్తి సమయం రిమోట్ వర్క్ కోసం ఆమోదించని వారు ఆఫీసులకు హాజరు తప్పనిసరి. అలాగే.. పూర్తి రిమోట్ ఉద్యోగులు "స్పష్టమైన వ్యాపార కారణం" కలిగి ఉంటే తప్ప ప్రతి రెండు నెలలకు నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు కార్యాలయానికి రావడానికి అనుమతించబడరని స్పష్టం చేసింది. అమెరికాలో ఇతర టెక్ దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించే పనిలో పడ్డాయి.


Click it and Unblock the Notifications