Meta Layoff's: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా వచ్చే వారం ఉద్యోగుల తొలగింపులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నెలలు గడుస్తున్నా ఉద్యోగాల కోతలు ఆగకపోవటంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
గురువారం ఉద్యోగులతో ప్రశ్నోత్తరాల సెషన్‌ను నిర్వహించిన ఎగ్జిక్యూటివ్‌లు తొలగింపులపై క్లారిటీ ఇచ్చారు. తాజా తొలగింపులు మెటా వ్యాపార విభాగాలపై ప్రభావం చూపుతాయని అలాగే వేలాది మంది ఉద్యోగులు ప్రమాదంలో పడతారని వెల్లడైంది. ఇది చాలా ఆందోళనకరమైన, అనిశ్చితితో కూడుకున్న సమయమని మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ అభిప్రాయపడ్డారు. తొలగించబడే ఉద్యోగులకు ముందుగా తెలియజేస్తామని.. ఆ తర్వాత ప్రభావితం కాని ఉద్యోగులకు సమాచారమిస్తామని ఆయన వెల్లడించారు.

ఈ రౌండ్ తొలగింపుల ఖచ్చితమైన పరిధిని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు స్పష్టంగా ధృవీకరించనప్పటికీ.. నవంబర్‌లో 11,000 స్థానాలను తగ్గించిన తర్వాత మే చివరి నాటికి 10,000 స్థానాలను తొలగించాలని మెటా యోచిస్తున్నట్లు జుకర్‌బర్గ్ గతం మార్చిలో పేర్కొన్నారు. మునుపటి నెలలో Meta ఇప్పటికే దాదాపు 4,000 స్థానాలను తగ్గించింది. అయితే రాబోయే రౌండ్‌లో దాదాపు 6,000 స్థానాలు ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2022 చివరి నాటికి Metaలో దాదాపు 86,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
తొలగింపులకు సంబంధించి తదుపరి వ్యాఖ్యలను అందించడానికి మెటా ప్రతినిధి నిరాకరించారు. రాబోయే తొలగింపుల చుట్టూ ఉన్న అనిశ్చితి సంస్థలో ఇప్పటికే సవాలుతో కూడిన వాతావరణానికి అద్ధం పడుతోంది. అయితే క్లెగ్ అటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారి స్థితిస్థాపకత, వృత్తి నైపుణ్యం కోసం ఉద్యోగులను ప్రశంసించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications