Reliance News: రిలయన్స్‌తో మెటా భారీ అగ్రిమెంట్.. అనంత్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ వెనుక బిజినెస్ వ్యూహం..
Anant Ambani: ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ప్రపంచంలోని దిగ్గజ వ్యాపారవేత్తలు కొలువుదీరారు. వారిలో ప్రముఖ సామాజికమాధ్యమ దిగ్గజం గ్రూపు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఉన్నారు. అయితే ఇది కేవలం పెళ్లి వేడుక మాత్రమే కాదని, బిజినెస్ మీటింగ్‌గానూ పనిచేసినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. చెన్నైలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాంపస్‌లో మెటా భారతదేశంలో తన మొదటి డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన భారీ ఒప్పందంపై ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ అనంతరం సంతకాలు జరిగాయి. ప్రస్తుతం భారతీయ వినియోగదారుల డేటాను మెటా సింగపూర్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కంపెనీకి ఉన్న ఏకైక డేటా సెంటర్ ఇదే.

భారత్‌లో కొత్త డేటా సెంటర్‌ను ప్రారంభించడం వలన మెటా డేటా ప్రాసెసింగ్ వేగవంతం కానుంది. ఖర్చులు తగ్గడంతోపాటు స్థానిక ప్రకటనలు మరియు వినియోగదారుల అనుభవాన్ని కూడా పెంచుతుందని భావిస్తోంది. ఇందుకోసం చెన్నైలోని అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని 10 ఎకరాల MAA10 క్యాంపస్‌ను మెటా ఎంచుకుంది. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు డిజిటల్ రియాల్టీ జాయింట్ వెంచర్ ద్వారా 100 మెగావాట్ల (MW) IT లోడ్‌ను ఇది నిర్వహించగలదు.
దేశంలో పెరుగుతున్న డేటా సెంటర్ పరిశ్రమ బిజినెస్‌లో మెజారిటీ వాటా దక్కించుకోవాలని మార్క్ జుకర్‌బర్గ్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికితోడు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యక్తిగత డేటా రక్షణ చట్టం నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డేటా నిల్వ మరియు ప్రాసెసింగ్‌ను స్థానికీకరించడానికి టెక్ దిగ్గజాల మధ్య పెరుగుతన్న ధోరణిని ఇది ప్రతిబింబిస్తోంది.


Click it and Unblock the Notifications