ప్రపంచ టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పోటీ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ పోటీలో ముందుండాలని మెటా (Meta) కొన్ని సంవత్సరాల క్రితం ప్రత్యేకంగా AI విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ విభాగంలో అనేక ప్రతిభావంతులైన టెకీలు చేరారు. ముఖ్యంగా, అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు మెటా లక్షల డాలర్ల భారీ జీత ప్యాకేజీలు కూడా ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులు సంవత్సరానికి వంద మిలియన్ డాలర్ల వరకు వేతనం పొందినట్లు సమాచారం.

కానీ తాజాగా, ఈ AI విభాగం లోపల ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. మెటా యాజమాన్యం తన AI విభాగాన్ని నాలుగు చిన్న యూనిట్లుగా విడగొట్టాలని నిర్ణయించింది. దీని ఉద్దేశ్యం ప్రతి టీమ్ ఒక్కో రంగంపై మాత్రమే దృష్టి పెట్టి త్వరగా మంచి ఫలితాలు ఇవ్వడం. ఉదాహరణకి, ఒక టీమ్ లాంగ్వేజ్ AI మోడల్స్ పై పని చేస్తుంది. ఇంకో టీమ్ ఫోటోలు, వీడియోలకు సంబంధించిన టూల్స్ తయారు చేస్తుంది. మూడో టీమ్ కొత్త ప్రొడక్ట్స్‌పై దృష్టి పెడుతుంది. చివరి టీమ్ కొత్త AI ఆవిష్కరణలు, ప్రయోగాలపై ఫోకస్ చేస్తుందని చెబుతున్నారు.
అయితే ఈ నిర్ణయం ఉద్యోగులలో మిశ్రమ స్పందన తెచ్చింది. కొందరికి ఇది ఒక అవకాశం లాగా అనిపిస్తోంది ఎందుకంటే చిన్న టీంలలో తమ ప్రతిభను సులభంగా నిరూపించుకునే వీలుంటుంది. కానీ మరోవైపు, చాలామంది ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విభజనతో భవిష్యత్తు స్పష్టంగా కనిపించడం లేదని, తాము ఏ టీంలో ఉంటామో, ఏ విధమైన ప్రాజెక్టులపై పనిచేయాల్సి వస్తుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
దీని ఫలితంగా, కొంతమంది టెకీలు ఇప్పటికే కంపెనీని వదిలి వెళ్లడం ప్రారంభించారు. మార్కెట్‌లో మెటా నుండి టాప్ టాలెంట్ బయటకు వస్తోందనే వార్తలతో ఇతర టెక్ దిగ్గజాలు (గూగుల్, మైక్రోసాఫ్ట్, OpenAI వంటివి) ఆ ప్రతిభను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇక పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెటా ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. OpenAI, ఆంత్రోపిక్, గూగుల్ డీప్ మైండ్ వంటి సంస్థలు ఇప్పటికే శక్తివంతమైన AI మోడల్స్‌ను విడుదల చేస్తున్నాయి. వాటితో పోటీ పడాలంటే విభాగం లోపల మరింత స్పష్టమైన వ్యూహం అవసరం. ఒకే పెద్ద టీమ్‌లో పనిచేస్తే దృష్టి బలహీనపడే అవకాశం ఉంది. అందుకే చిన్న యూనిట్ల ద్వారా స్పష్టమైన లక్ష్యాలు పెట్టడం మంచిదని భావించారు.
అయితే, ఇలాంటి మార్పులు సాధారణంగా ఉద్యోగులలో ఒక రకమైన మానసిక ఒత్తిడిని తీసుకొస్తాయి. భవిష్యత్తుపై అనిశ్చితి పెరగడం సహజమే. ముఖ్యంగా, ఎప్పటిలా ఆకర్షణీయమైన జీతాలు ఉన్నప్పటికీ, స్థిరత్వం లేకపోవడం కొంతమంది ఉద్యోగులను ఇతర అవకాశాల కోసం వెతికేలా చేస్తోంది.
మెటా ఈ నిర్ణయం తీసుకోవాడం AI రంగంలో ఒక వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తున్నప్పటికీ, అంతర్గతంగా అది ఉద్యోగులలో అనుమానాలు, ఆందోళనలు రేకెతిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ విభాగం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎన్ని ప్రతిభావంతులు కంపెనీలో కొనసాగుతారో చూడాలి.
మెటా గత ఆరు నెలల్లో నాలుగోసారి తన AI విభాగంలో మార్పులు చేసింది. ఇది చూస్తే వారి AI వ్యూహాల్లో కొంత గందరగోళం లేదా నిలకడగా లేకపోవడం అనిపిస్తోంది. ముఖ్యంగా వారి ప్రధాన AI మోడల్ "Llama 4" కి మార్కెట్ నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో కంపెనీ కొత్త దారులు వెతుకుతోంది. ఈ క్రమంలో మెటా AI పరిశోధనపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2025 నాటికి సంవత్సరానికి $72 బిలియన్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉందని అంచనా. ఇందులో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం, ఉత్తమ AI నిపుణుల నియామకం వంటి అంశాలు ఉన్నాయి.
ఇక టెక్నాలజీ విషయంలో, మెటా ఇప్పుడు కేవలం తన సొంత మోడల్స్ మీదే ఆధారపడటం లేదు. ఓపెన్ సోర్స్ AI మోడల్స్, అలాగే లైసెన్స్డ్ క్లోజ్డ్ సోర్స్ మోడల్స్ రెండింటినీ ఉపయోగించి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. మొత్తానికి, మెటా ఇప్పుడు ఒకే దారిలో కాకుండా, అన్ని రకాల అవకాశాలను వాడుకుంటూ AI రంగంలో తన స్థాయిని పెంచుకోవాలని నిర్ణయించుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications