AI: ఇప్పుడంతా AI టెక్నాలజీ దందా నడుస్తోంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ, ఆందోళన. ChatGPT రాకతో ఉద్యోగాల సృష్టిపై నీలినీడలు కమ్ముకున్నాయి. OpenAIతో మొదలైన ఈ విప్లవం మరింత విస్తరిస్తూనే ఉంది. ఆయా దిగ్గజ సంస్థలు తమ సొంత AI సాంకేతికతను రూపొందించుకునే పనిలో ఉన్నాయి.
మెటా తాజాగా ఓ ఉత్పాదక AI మోడల్ ను లాంచ్ చేసింది. 'CM3leon' పేరిట రిలీజ్ అయిన ఈ మోడల్ ను 'కమీలియన్'గా ఉచ్ఛరిస్తారు. ఇది టెక్స్ట్-టు-ఇమేజ్ మరియు ఇమేజ్-టు-టెక్స్ట్ జనరేషన్ రెండింటినీ చేస్తుందని కంపెనీ తెలిపింది. విరివిగా వినియోగిస్తున్న ఇమేజ్ జనరేషన్ బెంచ్ మార్క్ తో పోలిస్తే మంచి స్కోరు సాధించినట్లు వెల్లడించింది. గూగుల్ 'టెక్స్ట్ టు ఇమేజ్' మోడల్ పార్థిని మించిపోయినట్లు ప్రకటించింది.

CM3leon అనేది టెక్స్ట్ ఓన్లీ భాషా నమూనాల రెసిపీ ద్వారా శిక్షణ పొందిన మొదటి మల్టీమోడల్ గా కంపెనీ చెబుతోంది. ఇందులో 'లార్జ్ స్కేల్ రిట్రైవల్ అగ్మెంటెడ్ ప్రీ ట్రైనింగ్' మరియు 'మల్టీటాస్క్ సూపర్‌వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్' అనే రెండు స్టేజ్ లు ఉన్నట్లు మెటా తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. గత ట్రాన్స్ ఫార్మర్ ఆధారిత పద్ధతులతో పోలిస్తే చాలా చిన్న డేటా సెట్ సరిపోతుందని తెలిపింది.
హై క్వాలిటీ ఉత్పాదక AI మోడళ్లను రూపొందించాలనే లక్ష్యంతో CM3leonను తీసుకొచ్చినట్లు మోటా చెప్పింది. వివిధ రకాల టాస్క్స్ పూర్తి చేయడంలో బలమైన పనితీరుతో కూడిన మోడళ్ల తయారీకి ఇదొక ముందడుగుగా భావిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరహా మోడళ్లు సృజనాత్మకతను, మెటావర్స్ లో మెరుగైన అప్లికేషన్ల్ పెంచడంలో సహాయపడతాయని భావిస్తోంది.


Click it and Unblock the Notifications