AI రంగంలో Meta సంచలనం.. అత్యంత తక్కువ ఖర్చుతో మ్యూస్ ఎంబర్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..

Meta Muse Ember AI Model Explained: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పోటీ తీవ్రమవుతున్న తరుణంలో.. ప్రముఖ సాంకేతిక దిగ్గజం మెటా సోమవారం ఒక నూతన, అత్యంత శక్తివంతమైన AI మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన ఫేబుల్ 5.2 (Fable 5.2), మిథోస్ 5.2 (Mythos 5.2) మోడళ్లకు పోటీగా.. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ఈ సరికొత్త ఆవిష్కరణను అందుబాటులోకి తెచ్చింది. పనితీరులో ఎలాంటి రాజీ పడకుండా, భారీ స్థాయి ఏఐ కార్యకలాపాలను అత్యంత తక్కువ ఖర్చుతో పూర్తి చేయడమే లక్ష్యంగా దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

'మ్యూస్ ఎంబర్' (Muse Ember) అని పేరు పెట్టబడిన ఈ మోడల్‌ను 'మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్' ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు కంపెనీ విడుదల చేసిన మోడళ్లలో అత్యంత తేలికైనది (Lightweight), వేగవంతమైనది. తక్కువ ఖర్చుతో కూడినదిగా మ్యూస్ ఎంబర్ నిలిచింది. మెటా ప్రతినిధుల ప్రకారం.. ఈ ఏఐ మోడల్ కోడింగ్ సబ్‌టాస్క్‌లు, డేటా సంగ్రహణ (Data Extraction), సుదీర్ఘ డాక్యుమెంట్ల ప్రాసెసింగ్ (Document Parsing), రూటింగ్, బాహ్య సాధనాలతో సంభాషించడం (Tool Calls) వంటి పునరావృతమయ్యే సంక్లిష్ట పనులను చాలా సులభంగా నిర్వహించగలదు.

Meta Muse Ember Muse Ember AI model Meta AI launch 2026 Muse Ember pricing Muse Ember features Meta AI model news OpenAI competitor Anthropic competitor AI model price comparison AI agent model lightweight AI model multimodal AI AI coding model AI automation Muse Ember API Meta Superintelligence Labs Muse Ember vs ChatGPT Muse Ember vs Claude AI technology news Meta Muse Ember AI Meta AI Muse Ember Muse Ember AI

మ్యూస్ ఎంబర్ యొక్క ప్రధాన ఆకర్షణ దాని నిర్వహణ వ్యయం అని చెప్పవచ్చు. మెటా అందించిన వివరాల ప్రకారం.. ఈ ఏఐ మోడల్ వినియోగానికి ప్రతి 1 మిలియన్ ఇన్‌పుట్ టోకెన్‌లకు కేవలం 10 సెంట్లు (10 cents) మాత్రమే ఖర్చవుతుంది. OpenAIకి చెందిన లూనా (Luna), ఆంత్రోపిక్‌కి చెందిన హైకు (Haiku) వంటి పోటీదారుల మోడళ్లతో పోలిస్తే ఇది ఖర్చు, పనితీరులో స్పష్టమైన ప్రయోజనాన్ని కలిగి ఉందని నిరూపించడానికి ఆర్టిఫిషియల్ అనాలిసిస్ కాంపోజిట్ బెంచ్‌మార్క్ స్కోర్‌ను మెటా ఉదాహరణగా చూపింది. అలాగే, ఓపెన్-సోర్స్ ప్రత్యామ్నాయాలైన డీప్‌సీక్ V4.1 ఫ్లాష్ (DeepSeek V4.1 Flash), GLM 5.3 ఫ్లాష్ మోడళ్లతో పోల్చినా ఎంబర్ ధర చాలా పోటీగా ఉందని స్పష్టం చేసింది.

Also Read

కేవలం టెక్స్ట్‌కే పరిమితం కాకుండా, మ్యూస్ ఎంబర్ ఇమేజెస్ (చిత్రాలు), ఆడియో రికార్డింగ్‌లను కూడా సమర్థవంతంగా ప్రాసెస్ చేయగలదు. అందువల్ల ప్రతి ఫార్మాట్‌కు ప్రత్యేక మోడల్ అవసరం లేకుండానే.. వ్యాపార సంస్థలు, ఏఐ ఏజెంట్లు స్క్రీన్‌షాట్‌లు, చార్ట్‌లు, స్కాన్ చేసిన డాక్యుమెంట్‌లు, వాయిస్ నోట్స్, మీటింగ్ రికార్డింగ్‌లు, వీడియోలను ఒకే చోట విశ్లేషించవచ్చు. రికార్డింగ్‌లు, డాక్యుమెంట్లతో ఎక్కువగా పనిచేసే కార్పొరేట్ సంస్థలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

ఈ సందర్భంగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. ఈ రోజు మ్యూస్ ఎంబర్‌ను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా అతి చిన్న మోడల్ అయినప్పటికీ, తన కేటగిరీలోని ఇతర మోడళ్లతో పోలిస్తే ప్రతి డాలర్‌కు అత్యధిక ఇంటెలిజెన్స్‌ను అందిస్తుంది. ఏజెంట్లు రోజంతా పునరావృతం చేసే టోకెన్-హెవీ పనులైన టూల్ కాల్స్, కోడింగ్ సబ్‌టాస్క్‌లు, రూటింగ్, ఎక్స్‌ట్రాక్షన్ మరియు సుదీర్ఘ డాక్యుమెంట్ పార్సింగ్ కోసం ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడిందని తెలిపారు.

ప్రస్తుతం మ్యూస్ ఎంబర్ మోడల్ మెటా మోడల్ API (Meta Model API), మ్యూస్ కోడ్ (Muse Code) వేదికలలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా, మ్యూస్ ఎంబర్, మ్యూస్ స్పార్క్ 1.3 (Muse Spark 1.3), మ్యూస్ వండర్ (Muse Wonder) మోడళ్లు గూగుల్ క్లౌడ్ (Google Cloud) ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులో ఉన్నాయని జుకర్‌బర్గ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+