Meta: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్లో కొత్త ఫీచర్.. పిల్లలు ఆ పని చేస్తే తల్లిదండ్రులకు నోటిఫికేషన్..!
ఇన్‌స్టాగ్రామ్, ఇతర మెటా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న చాట్‌బాట్ అయిన మెటా ఏఐతో, టీనేజర్లు ఆత్మహత్య లేదా స్వీయ-హాని గురించి చర్చిస్తే, తల్లిదండ్రులకు హెచ్చరికలు పంపే కొత్త భద్రతా ఫీచర్‌ను మెటా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తల్లిదండ్రులు తమ టీనేజర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో జరిపే సంభాషణలను పర్యవేక్షించే విధానాన్ని మార్చవచ్చు. ముఖ్యంగా యువ వినియోగదారులు మానసిక ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పుడు, ఏఐ కంపెనీల చాట్‌బాట్‌లు ఎలా స్పందిస్తున్నాయనే దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ మొదట యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో అందుబాటులోకి రానుంది.
ఇది ఇన్‌స్టాగ్రామ్ పేరెంటల్ సూపర్‌విజన్ టూల్స్ ఉపయోగించే తల్లిదండ్రులకు అందుబాటులోకి వస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని మెటా ప్రకటించింది. ఒక టీనేజర్ స్వీయ-హాని లేదా ఆత్మహత్య గురించి స్పష్టంగా ప్రస్తావించిన సంభాషణలను గుర్తించడానికి ఒక ప్రత్యేక ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేశామని మెటా వెల్లడించింది. అయితే తుది నిర్ణయాన్ని ఏఐ స్వయంగా తీసుకోదని కంపెనీ చెబుతోంది. తల్లిదండ్రులకు నోటిఫికేషన్ పంపుతుందన్నారు. ఒక టీనేజర్ ఉద్దేశం పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, అది తల్లిదండ్రులకు తెలియజేయవచ్చని కంపెనీ వివరించింది.

ఈ తాజా అప్‌డేట్ గత కొన్ని నెలలుగా మెటా ఇప్పటికే ప్రవేశపెట్టిన భద్రతా ఫీచర్లను మరింత మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. టీనేజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పదేపదే ఆత్మహత్య లేదా స్వీయ-హాని కంటెంట్ కోసం వెతికితే తల్లిదండ్రులు ఇప్పటికే నోటిఫికేషన్లు వెళ్తున్నట్లు చెప్పింది. వారు పూర్తి సంభాషణను చూడలేకపోయినా, గత వారంలో తమ టీనేజర్ మెటా AIతో చర్చించిన విస్తృత అంశాలను కూడా చూడవచ్చని స్పష్టం చేసింది. ఈ చాట్‌బాట్ ఇప్పటికే టీనేజర్లతో లైంగిక, శృంగార లేదా మద్యం సంబంధిత సంభాషణలలో పాల్గొనకుండా చేస్తోంది.
తల్లిదండ్రుల హెచ్చరికలకు అతీతంగా, అత్యవసర సేవల సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయగల మరొక భద్రతా ఫీచర్ మెటా పనిచేస్తోంది. Meta AIతో జరిగే సంభాషణల ద్వారా, వినియోగదారు ఆత్మహత్య చేసుకునే తక్షణ ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే, అత్యవసర సేవల విభాగాలకు సమాచారం అందించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఫేస్ బుక్ లేదా ఇన్ స్టాగ్రామ్ లో వినియోగదారులు ఆత్మహత్యకు సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేసినప్పుడు Meta ఇప్పటికే ఇలాంటి విధానాన్నే అనుసరిస్తోంది.


Click it and Unblock the Notifications