WhatsApp: వాట్సాప్ బిజినెస్ యూజర్లకు షాక్.. ఛార్జీలు వసూలు చేయనున్న మెటా..!
వాట్సాప్ బిజినెస్ ప్లాట్ ఫామ్ కు సంబంధించి మెటా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కు సంబంధించి ఉచితంగా అందిస్తున్న కస్టమర్ సర్వీస్ మెసేజింగ్ సేవలకు ఎడ్ కార్డు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాంచ్ అయినప్పటి నుంచి ఫ్రీగా ఉన్న ఈ కమ్యూనికేషన్ కేటగిరీపై ఇక నుంచి ప్రతి మెసేజ్‌కు ఛార్జీలు వసూలు చేసేందుకు మెటా సిద్ధమైంది. ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ నిర్వహిస్తున్న పెద్ద కంపెనీలకు ఈ నిర్ణయం భారీ ఆర్థిక భారమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు కస్టమర్ మెసేజ్ చేసిన తర్వాత ప్రారంభమయ్యే 24 గంటల 'సర్వీస్ విండో' సమయంలో వ్యాపార సంస్థలు ఉచితంగా రిప్లై ఇస్తూ వచ్చాయి.
కానీ అక్టోబర్ 1 నుంచి ఈ సర్వీస్ మెసేజ్‌లు ఇండియాలో ఒక్కో మెసేజ్‌కు సుమారు 11.5 పైసలు చొప్పున ఛార్జ్ చేసే అవకాశం ఉంది. గతంలో ఉచితంగా ఉన్న యూటిలిటీ టెంప్లేట్ మెసేజ్‌లపై కూడా ఇకపై బిల్లింగ్ ఉంటుందని మెటా ప్రకటించింది. 24 గంటల విండో లోపల పంపినప్పటికీ వాటికి ఛార్జీలు చెల్లించాల్సిందేనని మెటా పేర్కొంది. వ్యాపార సంస్థలపై ఒక్కసారిగా భారం పడకుండా ప్రతీ బిజినెస్ ఫోన్ నంబర్‌కు క్యాలెండర్ నెలకు 1,000 ఉచిత సర్వీస్ మెసేజ్‌లను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కోటా ప్రతి నెలా రీసెట్ అవుతుందని పేర్కొంది. ఈ 1,000 ఉచిత మెసేజ్‌ల పరిమితి దాటిన తర్వాత ప్రతీ మెసేజ్‌కు విడివిడిగా బిల్లింగ్ జరుగుతుందని వివరించింది.

ముఖ్యంగా ఒకే కస్టమర్ సపోర్ట్ చాట్‌లో బదులిచ్చే అనేక మెసేజ్ బబుల్స్‌కు విడివిడిగా ఛార్జీలు పడనున్నాయి. ఈ కొత్త రూల్స్ కేవలం పెయిడ్ వాట్సాప్ బిజినెస్ API వాడుతున్న పెద్ద సంస్థలు, హై-వాల్యూమ్ ఆటోమేటెడ్ సపోర్ట్ రన్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే లక్ష్యంగా తీసుకొచ్చారు. వ్యక్తిగత(Personal) వాట్సాప్ వినియోగదారులకు, చిన్న వ్యాపారాలు వాడే ఫ్రీ వాట్సాప్ బిజినెస్ యాప్‌కు దీనితో ఎలాంటి సంబంధం లేదు. AI ఆధారిత ఏజెంట్లను వాడే సంస్థల నిర్వహణ ఖర్చులు మెటా నిర్ణయంతో భారీగానే పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాట్సాప్‌లో భారీ ఎత్తున జరిగే ఆటోమేటెడ్ స్పామ్ మెసేజింగ్‌ను అరికట్టడానికి, ఇతర కస్టమర్ సర్వీస్ ఛానెళ్ల మాదిరిగానే దీని ఆర్థిక విధానాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మెటా పేర్కొంది.
అటు దక్షిణాఫ్రికాలో కూడా వాట్సాప్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుంచి వాట్సాప్‌లో తమ కస్టమర్లకు పంపే ప్రత్యుత్తరాలకు దక్షిణాఫ్రికా వ్యాపారాల నుంచి మెటా ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తుందని వార్తలు వస్తున్నాయి. నవంబర్ 2024 నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌పై కస్టమర్ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తున్న మినహాయింపు ముగుస్తుంది. ఈ ఛార్జీ వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లోని సర్వీస్ మెసేజ్‌లకు వర్తిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
