Zuckerberg: బిల్‌గేట్స్‌ని వెనక్కి నెట్టిన మార్క్ మామ.. కుబేరుల జాబితాలో ముందుకు..
Bill Gates: మార్క్ జుకర్‌బర్గ్ ఇది పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వాడే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సంస్థల వ్యవస్థాపకుడు. ప్రస్తుతం ఆయన సంపద విపరీతంగా పెరగటంతో ప్రపంచ కుబేరుల్లో దూకుసుపోతున్నారు.
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పుడు బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మెటా స్టాక్ ధరలో 22 శాతం పెరుగుదల దీనివెనుక అసలు కారణంగా ఉంది. తాజా స్టాక్ బూమ్ ఇది జుకర్‌బర్గ్ సంపదను 28 బిలియన్ డాలర్లకు పైగా పెంచటంతో.. మార్క్ మామ మెుత్తం నికర విలువ ఏకంగా 170 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో గేట్స్ నికర విలువ కేవలం 145 బిలియన్ డాలర్లకు పరిమితం కావటంతో వెనకపడిపోయారు.

ప్రపంచ సంపన్నుల తాజా జాబితా ప్రకారం.. జుకర్‌బర్గ్ కంటే ధనవంతులు బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్ మాత్రమే. ఇంకా మెటా తన మొట్టమొదటి డివిడెండ్‌ను మార్చిలో పంపిణీ చేసినప్పుడు జుకర్‌బర్గ్ సుమారుగా 174 మిలియన్ డాలర్లను ఏకంగా నగదు రూపంలో తనకున్న వాటాల కింద పొందనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మార్క్ దాదాపు 350 మిలియన్ క్లాస్ A, B షేర్లకు యజమానిగా కంపెనీలో వాటాలను కలిగి ఉన్నారు. అయితే మెటా తన 50 సెంట్స్ త్రైమాసిక డివిడెండ్ కొనసాగిస్తే.. జుకర్‌బర్గ్ వార్షిక ఆదాయాలు 690 మిలియన్ డాలర్లకు మించిపోతుందని తెలుస్తోంది.
మార్క్ జుకర్‌బర్గ్ తన వాట్సాప్ ఛానెల్‌ల ద్వారా ఫేస్‌బుక్ 20వ పుట్టినరోజును జరుపుకోవడం జరిగింది. అతను 20 నంబర్ ఆకారంలో ఉన్న కేక్‌లపై కొవ్వొత్తులను ఊదుతున్న వీడియోను పంచుకున్నారు. అతను తన ప్రయాణ మాంటేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వెబ్‌సైట్ కళాశాల స్థాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభించబడినప్పటి నుంచి ఫేస్‌బుక్ పూర్తి చరిత్ర ఇందులో పొందుపరచబడింది.


Click it and Unblock the Notifications