Tweet: 11 ఏళ్ల తర్వాత మార్క్ మామ మొదటి ట్వీట్.. లైకులతో మోతమోగిన ట్విట్టర్
Tweet: మెటా నుంచి తాజాగా కొత్త యాప్ థ్రెడ్ లాంచ్ అయింది. అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే భారీ డౌన్లోడ్స్ తో మోత మోగిపోయింది. దీన్ని ట్విట్టర్ కు పోటీగా భావిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే, ఎంతో కాలంగా ట్విట్టర్ కు దూరంగా ఉంటున్న ఫేస్ బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్ బర్గ్ యాక్టివ్ అయ్యారు. ఆయన ట్వీట్ కు, లాంచ్ అయిన యాప్ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

దాదాపు 11 ఏళ్లుగా ఒక్క ట్వీట్ చేయని మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్.. ఎట్టకేలకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. కేవలం ఒకే ఒక ఫొటో ట్వీట్ చేయగా.. దానికి 28 మిలియన్లకు పైగా వ్యూస్, 228.8K లైకులు వచ్చాయి. తీరా ఆయన పోస్ట్ చేసింది ఏంటంటే.. ఓ స్పైడర్ మ్యాన్ మరో స్పైడర్ మ్యాన్ ని చూపిస్తున్నట్లు ఉన్న 1967 నాటి పాత కార్టూన్.

దాదాపు ట్విట్టర్ మాదిరిగానే థ్రెడ్ ను పోటీకి దింపుతున్నట్లు సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. థ్రెడ్స్ కేవలం ట్విట్టర్ కాపీ పేస్ట్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. స్నాప్ చాట్ చూసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, టిక్ టాక్ మాదిరిగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ ను కాపి చేసి ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ రూపొందించారని ఏకిపారేస్తున్నారు.
జనవరి 18, 2012 న మార్క్ జుకర్ బర్గ్ ట్విట్టర్ లో తన చివరి పోస్ట్ చేశారు. ఇంటర్నెట్ కు అనుకూలంగా ప్రజలు స్వరాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ట్విట్టర్ కు పోటీగా దించిన యాప్ ను ట్వీట్ ద్వారానే ప్రమోట్ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్విట్టర్ ను కాపీ పేస్ట్ చేసి థ్రెడ్స్ సృష్టించారని ఓ యూజర్ చేసిన ట్వీట్ కు.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇవ్వడం విశేషం.


Click it and Unblock the Notifications