Meta Layoff: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ అయిన మెటాలో మరోసారి భారీ తొలగింపులు జరగబోతోంది. నివేదికల ప్రకారం, కంపెనీ సుమారు 3,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతు ఓ లిస్ట్ రెడీ చేసింది. గత శుక్రవారం ఇంటర్నల్ మెమో ద్వారా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేశామని, నేటి నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది.
సోమవారం నుండి తొలగింపు ప్రక్రియ ప్రారంభం
బిజినెస్ టుడేలో ప్రచురితమైన రాయిటర్స్ నివేదిక ప్రకారం, తాజా తొలగింపుల కోసం షార్ట్‌లిస్ట్ చేసిన మెటా ఉద్యోగులకు సోమవారం నుండి నోటిఫికేషన్లు అందడం ప్రారంభమవుతుంది అలాగే కంపెనీ ఫిబ్రవరి 11న తొలగింపు నోటీసులను పంపుతుంది. మెటా హ్యూమన్ రిసోర్స్ వైస్ ప్రెసిడెంట్ జానెల్లే గేల్, కంపెనీ వర్క్‌ప్లేస్ ఫోరమ్‌లో ఈ మెమోను షేర్ చేసారు, ఇందులో ఈ కీలక తొలగింపుల గురించి చర్చించారు.

మెటా ఇంక్‌లో తొలగింపులు ప్రారంభం కావడానికి ముందే
కంపెనీ గత నెలలో ఉద్యోగులను దాదాపు 5% తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు ధృవీకరించింది, అయితే ఈ మొత్తం ఉద్యోగుల సంఖ్య పరంగా దాదాపు 3,000 ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ విషయం గురించి ఇంకా తొలగింపు వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్య గురించి కంపెనీ ఎటువంటి సమాచారాన్ని షేర్ చేయలేదు. ఈ తొలగింపులు మొతం అన్ని టీంలపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు.
అందుకే తొలగింపులు జరుగుతున్నాయా?
ఈ తాజా తొలగింపుల వెనుక గల కారణాల గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలను వెల్లడించనప్పటికీ, మెటా చాల పోస్టులను తగ్గించుకుంటూనే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు ఇంకా ఇతర AI ఆపరేటెడ్ పోస్టుల కోసం నియామక ప్రక్రియలను వేగవంతం చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ తొలగింపుల పరంపర మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ మెటాకే పరిమితం కాదు. దీనికి తోడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అలాగే స్ట్రైప్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా 2025లో కంపెనీ వర్క్ ఫోర్స్ తగ్గించుకున్నాయి. చివరికి అమెజాన్ కూడా ఫ్యాషన్ అండ్ ఫిట్‌నెస్ విభాగాలలో దాదాపు 200 ఉద్యోగాలను తగ్గించింది.
ఈ నివేదికలు నిజమైతే ఒకవైపు స్ట్రైప్ 2025 చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 17 శాతం పెంచాలని యోచిస్తోంది, మరోవైపు, ఉత్పత్తి, ఇంజనీరింగ్ అండ్ కార్యకలాపాలకు సంబంధించిన దాదాపు 300 మంది ఉద్యోగులను ఇటీవల ఉద్యోగాల నుండి తొలగించారు. రాబిన్‌హుడ్ మీడియా విభాగం షేర్‌వుడ్ కూడా పునర్నిర్మాణాన్ని పేర్కొంటూ చాల మంది సిబ్బందిని తొలగించింది.


Click it and Unblock the Notifications