Kunal Shah: వాట్సాప్ సీఈఓగా క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా..

ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల మన భారతీయుడే, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మన భారతీయుడే. తాజాగా వాట్సాప్ సీఈఓ కూడా మన భారతీయుడినే ఎంపిక చేశారు. వాట్సాప్ కొత్త సీఈఓగా క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షాను మెటా ప్రకటించింది. అంతే కాదు క్రెడ్ లో మెటా భారీగా పెట్టుబడి పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రెడ్ లో దాదాపు 900 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.8,550 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కాగా ప్రస్తుతం క్రెడ్ సీఈఓగా ఉన్న కునాల్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. మెటా కునాల్ తో చర్చలు జరిపిన అనంతరం ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

ఒప్పందం ప్రకారం వాట్సాప్ సీఈఓ పదవితో పాటు క్రెడ్ లో పెట్టుబడి పెట్టాలని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం మెటా క్రెడ్ లో 20 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. మెటా పెట్టుబడితో క్రెడ్ వాల్యుయేషన్ దాదాపు 4.5 మిలియన్ డాలర్లకు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.43,239 కోట్లకు చేరనుంది. కాగా తాజా కునాల్ షా ఓ ఓ పోస్ట్ చేశారు. 2015-2018 కాలంలో తన పొదుపు డబ్బు నుంచి 1 మిలియన్ డాలర్ తో క్రెడ్ ను స్థాపించినట్లు పేర్కొన్నారు. అయితే క్రెడ్ 2019 నుంచి 2025 మధ్య కాలంలో జీరో నుంచి 17 మిలియన్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. క్రెడ్ లో యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, బీమా చెల్లింపులతో పాటు రుణం కూడా తీసుకోవచ్చు.

kunal shah

ఈ మధ్య కాలంలో క్రెడ్ చాలా ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలోనే మెటా కన్ను క్రెడ్ పై పడినట్లు ఉంది. అందుకే కునాల్ షాకు వాట్సాప్ సీఈఓ పదవితో పాటు క్రెడ్ లో 900 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కాగా క్రెడ్ చాలా సార్లు ఫండ్ రైజ్ చేసింది. కానీ భారీ మొత్తంలో ఫండ్ రైజ్ చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

కునాల్ షా మొదటి నుంచి స్టార్టప్ స్థాపించి మంచి విజయాలను అందుకున్నారు. గతంలో డిజిటల్ చెల్లింపులు, రీఛార్జ్ ప్లాట్ ఫామ్ ఫ్రీఛార్జ్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఫ్రీఛార్జ్ ను స్నాప్ డీల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కునాల్ షా1979లో ముంబైలో జన్మించారు. విల్సన్ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో డిగ్రీ పొందారు. NMIMSలో MBA ప్రోగ్రామ్‌లో చేరారు. ఆయన 2010లో ఫ్రీఛార్జ్‌కు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. 2018లో క్రెడ్‌ను స్థాపించారు. ఇప్పుడు వాట్సాప్ సీఈఓగా బాధ్యతలు చెపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+