ఫుట్‌బాల్ ప్రపంచంలో తిరుగులేని రారాజు.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ భారతదేశానికి వస్తున్నారు! భారతీయ అభిమానులకు ఇది ఒక శుభవార్త. ఈ మెస్సీ ఇండియా టూర్ (Messi India Tour) లో భాగంగా.. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని ప్రత్యక్షంగా కలవడానికి, మాట్లాడటానికి, చివరికి ఆయనతో ఒక ఫోటో దిగడానికి కూడా అవకాశం లభించింది. అయితే ఈ అరుదైన అవకాశం అంత సులభంగా దక్కదు. మెస్సీతో ప్రత్యేకంగా ఫోటో దిగాలంటే.. అభిమానులు రూ. 9.95 లక్షలు (ప్లస్ జీఎస్‌టీ) చెల్లించాల్సి ఉంటుంది. ఈ అత్యంత ఖరీదైన ఫోటో-ఆప్ కోసం కేవలం 100 స్లాట్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్‌లో మెస్సీ ప్రత్యేక కార్యక్రమాలు
మెస్సీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ ప్రధాన వేదిక కానుంది. శనివారం (డిసెంబర్ 13) రోజున మెస్సీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ముందుగా ప్రీమియం ఫోటో-ఆప్ ఉంటుంది. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఎంపిక చేసిన 100 మంది అభిమానులకు ఈ ప్రత్యేక ఫోటో అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మూడు గంటల పాటు బహిరంగ కార్యక్రమం ఉంటుంది. మెస్సీ సాయంత్రం 4 గంటలకు సిటీకి చేరుకుని.. 7 గంటలకు స్టేడియం ఈవెంట్‌కు హాజరవుతారు. ఈ పర్యటనలో అర్జెంటీనా స్టార్ రోడ్రిగో డి పాల్, ఉరుగ్వే స్ట్రైకర్ లూయిస్ సువారెజ్ కూడా మెస్సీతో పాటు పాల్గొంటారు.
ఎగ్జిబిషన్ మ్యాచ్
మెస్సీ సింగరేణి RR-9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య జరిగే 20 నిమిషాల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొంటారు. చివరి ఐదు నిమిషాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. మెస్సీ చిన్నారులకు ఫుట్‌బాల్ క్లినిక్‌లో శిక్షణ ఇస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన సన్మానం అందుకోనున్నారు. ఈ కార్యక్రమాల టికెట్లను 'డిస్ట్రిక్ట్ యాప్' ద్వారా విక్రయిస్తున్నారు.
కోల్‌కతాలో 'హోలా మెస్సీ' వేడుక
Messi India Tour లో కోల్‌కతా కూడా మరొక ముఖ్యమైన నగరం. డిసెంబర్ 13న కోల్‌కతాలో మెస్సీ కోసం గ్రాండ్ సెలబ్రేషన్స్ సిద్ధమవుతున్నాయి. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఫ్యాన్ క్లబ్ కోల్‌కతా, సాల్ట్ లేక్‌లో మెస్సీ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. 'హోలా మెస్సీ' పేరుతో ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. దీని బయటి భాగాన్ని మెస్సీ మియామి మాన్షన్‌లాగా నిర్మించారు. లోపల భాగాన్ని మెస్సీ కెరీర్‌ను సెలబ్రేట్ చేస్తూ మ్యూజియంగా మార్చారు. అభిమానులు మెస్సీ గెలిచిన లా లిగా, ఛాంపియన్స్ లీగ్, కోపా అమెరికా, ప్రపంచ కప్ ట్రోఫీలు, బ్యాలన్ డి'ఓర్, గోల్డెన్ బూట్ వంటి వాటి రెప్లికాలను చూడవచ్చు. మెస్సీ ఇప్పటివరకు చేసిన ప్రతి గోల్‌కు (896) ప్రాతినిధ్యం వహించేలా పైకప్పుకు 896 ఫుట్‌బాల్‌లను అలంకరించారు. మెస్సీ 20 ఏళ్ల ప్రయాణాన్ని తెలియజేస్తూ 200 మీటర్ల LED వాల్‌లో ఆయన అద్భుతమైన మ్యాచ్‌లలోని హైలైట్‌లను ప్రదర్శించనున్నారు.
భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఉన్న అభిమానం, ముఖ్యంగా మెస్సీ పట్ల ఉన్న ప్రేమ ఈ పర్యటన ద్వారా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పబడుతోంది.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications