IPO News: ఇప్పుడు మార్కెట్లలో ఏం నడుస్తోందంటే.. ఐపీవోల దందా నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా వచ్చిన ప్రతి ఐపీవో మంచి ప్రీమియం ధరలకే మార్కెట్లో అడుగుపెడుతున్నాయి.
మేసన్ వాల్వ్స్ ఇండియా ఐపీవో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యింది. ఇష్యూ చేసిన ధర కంటే 90 శాతం ప్రీమియం రేటుకు ఇది బలమైన జాబితాను నమోదు చేసింది. దీంతో మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్లు తుఫాను లాభాలను అందుకున్నారు. ఇష్యూ సమయంలో ఒక్కో షేరును రూ.102కి విక్రయించగా.. బీఎస్ఈలో రూ.193.80 వద్ద జాబితా చేయబడింది.

సెప్టెంబర్ 8న ప్రారంభమై సెప్టెంబర్ 12న ఐపీవో ముగిసింది. తాజా ఐపీవో ద్వారా రూ.31.09 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం 1,200 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికోసం రూ.1,22,400 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. పూణేకు చెందిన వాల్వ్ సప్లయర్స్ ఐపీవో నిధుల్లో రూ.11.37 కోట్లను ప్లాట్ అండ్ మెషినరీ కొనుగోలుకు, రూ.11.95 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. మిగిలిన మెుత్తాన్ని కార్పొరేట్ ప్రయోజనాలకు ఉపయోగించనుంది.
కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. మేసన్ వాల్వ్స్ ఇండియా ప్రధానంగా నౌకాదళం, చమురు-గ్యాస్ పరిశ్రమలు, పవర్, రిఫైనరీలు, సాధారణ పరిశ్రమల కోసం వాల్వ్‌లు, యాక్యుయేటర్లు, స్ట్రైనర్లు, రిమోట్ కంట్రోల్‌లను తయారు చేస్తోంది. దేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.


Click it and Unblock the Notifications