Multibagger Stock: స్టాక్ మార్కెట్లో అనేక పెన్నీ స్టాక్స్ ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని మాత్రం మంచి వ్యాపార ఫండమెంటల్స్ కలిగి ఉంటాయి. వీటిని సరిగా అంచనావేసి పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ రాబడులను పొందుతున్నారు.
డిసెంబర్ మాసంలో స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ చూడని ర్యాలీని నమోదు చేస్తున్నాయి. దీంతో అన్ని రంగాల్లోని కంపెనీల షేర్లు మంచి పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఇది కొన్ని పెన్నీ మల్టీబ్యాగర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈ కేటగిరీలోని మెర్క్యురీ ఈవీ టెక్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. గడచిన రెండేళ్ల కాలంలో స్టాక్ ఏకంగా 15000 శాతానికి పైగా రాబడిని అందించింది.

వాస్తవానికి రెండేళ్ల కిందట 2021 డిసెంబర్‌న కంపెనీ షేర్ ధర కేవలం 80 పైసులు మాత్రమే. కానీ నేడు మార్కెట్లో కంపెనీ షేర్ విలువ బీఎస్ఈలో రూ.123.60గా కొనసాగుతోంది. ఈ క్రమంలో మార్కెట్ క్యాప్ రూ.2,170 కోట్లుగా కొనసాగుతోంది. వాస్తవానికి ఈవీ కంపెనీలో రెండేళ్ల కిందట ఎవరైనా ఇన్వెస్టర్ రూ.లక్ష పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ అక్షరాలా రూ.1.50 కోట్లకు చేరుకుని ఉండేది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.143.80 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.9.34గా ఉంది.
కంపెనీ ఆర్థిక పనితీరును పరిశీలిస్తే 2022-23లో నిర్వహణ ఆదాయం రూ.13.42 కోట్లకు చేరుకుంది. ఈ సమయంలో నికర లాభం రూ.88 లక్షలకు చేరుకుంది. పెరిగిన ఖర్చులతో కంపెనీ ఆదాయాలు కొంత తక్కువగా నమోదయ్యాయి. ఏప్రిల్‌లో మెర్క్యురీ ఈవీ-టెక్ లిమిటెడ్ అనుబంధ సంస్థ పవర్‌మెట్జ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.110 కోట్లు విలువైన ఆర్డర్ పొందటం గమనార్హం. ప్రస్తుతం దేశం ఈవీలవైపు మళ్లుతున్న వేళ కంపెనీ భవిష్యత్తుపై నిపుణులు సైతం సానుకూలంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications