Mercedes Benz: లేఆఫ్స్‌తో సతమతం అవుతున్న ఉద్యోగార్థులకు ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు ఆఫర్లు రిలీజ్ చేస్తున్నట్లు వింటున్నాం. ఈ కేటగిరీలోకి తాజాగా మెర్సిడెజ్ బెంజ్ సైతం చేరింది. తమ వ్యాపారాన్ని వేగవంతం చేసే ప్రణాళికల్లో భాగంగా భారీగా ఇంజనీర్లను నియమించుకోవడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ఈ మేరకు స్పష్టం చేశారు.
వచ్చే ఏడాదిలో దాదాపు వెయ్యికి పైగా ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు మెర్సిడెస్-బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా (MBRDI) ఉన్నతాధికారి తెలిపారు. దేశంలో డిజిటల్ నైపుణ్యాలతో కూడిన వారిని తమ టీమ్‌లో జాయిన్ చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని వేగవంతం చేసేందుకు అనుగుణంగా ఇంజనీర్ల సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు MBRDI మానవ వనరుల వైస్ ప్రెసిడెంట్ మహేష్ మేధేకర్ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం దేశంలోని R&D కేంద్రంలో సుమారు 7 వేల మంది పనిచేస్తున్నారు.

మెర్సిడెస్-బెంజ్ ఇండియాకు 2022 ఉత్తమ సంవత్సరంగా నిలిచింది. 15 వేల 822 యూనిట్లతో అత్యధిక అమ్మకాలను సాధించింది. "భారతీయ మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. 41 శాతం కంటే ఎక్కువ YoY వృద్ధి సాధించింది. ఇదే జోరును Q1 2023లోనూ కొనసాగించాము. మా అత్యుత్తమ Q1 అమ్మకాలు 4 వేల 697 యూనిట్లను సాధించాము" అని కంపెనీ ఇండియా విభాగం MD & CEO సంతోష్ అయ్యర్ వెల్లడించారు.
భారతీయుల కోసం దూకుడుగా ముందుకెళ్లే EV రోడ్‌మ్యాప్‌ను సైతం మెర్సిడెజ్ బెంజ్ కలిగి ఉంది. 2027 నాటికి విక్రయించబడే ప్రతి నాలుగు కార్లలో ఒకటి EVగా ఉంటుందని అంచనా. "భారత మార్కెట్ కోసం వచ్చే రెండేళ్లలో మా గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుంచి కొత్త EVలను విడుదల చేస్తాము" అని అయ్యర్ ప్రకటించారు. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు MBRDI MD & CEO మను సాలే తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications