Mercedes Benz: డబ్బు నిర్వహణ పట్ల భారతీయులకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్లు ప్రశంసలు కూడా అందాయి. భారతీయుల బలమైన పొదుపు మనస్తత్వం కారణంగా వారు తమతో పాటు తరువాతి తరాలకోసం డబ్బును పొదుపు చేస్తుంటారని టాప్ మెర్సిడెస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనిపై భారీగా చర్చ జరుగుతోంది.

ఎస్ఐపీ పెట్టుబడులు..
ఇటీవలి కాలంలో చాలా మందిలో ఆర్థిక అక్షరాస్యత బాగా పెరిగింది. అందుకే చాలా మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా ఎక్కువ మంది నెలవారీ SIPని ఎంచుకుంటున్నందున దేశంలో లగ్జరీ కార్ల వ్యాపారానికి ఆటంకం కలుగుతోందని Mercedes-Benz ఇండియా ప్రతినిధి కామెంట్స్ ట్విట్టర్ లో వైరల్ గా మారాయి.
సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్..
పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా, బలహీనమైన సామాజిక భద్రతా చర్యల కారణంగా భారతదేశం బలమైన పొదుపు మనస్తత్వాన్ని కలిగి ఉందని మెర్సిడెస్ బెంచ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ సంతోష్ అయ్యర్ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. భారతీయులు తమతో పాటు భవిష్యత్తు తరాలకు పొదుపు చేస్తారని ఆయన అన్నారు.
బెంజ్ అమ్మకాలు..
లగ్జరీ కార్ల గురించి ప్రతి నెల దాదాపు 15,000 మంది ఆరా తీస్తున్నప్పటికీ.. చివరగా ఆర్డర్ చేస్తున్నది కేవలం 1500 మాత్రమేనని అయ్యర్ అన్నారు. మిగిలిన వారు తమ కోరికను వాయిదా వేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలా వాయిదా వేసుకుంటున్నవారిలో ఎక్కువ మంది ప్రస్తుత SIP పెట్టుబడులతో కొనసాగాలని లేదా తరువాతి మార్కెట్ డిప్ లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారని సంతోష్ వ్యాఖ్యానించారు. అలా పరోక్షంగా భారతీయుల పొదుపుతత్వాన్ని తప్పుపట్టారు.

నెటిజన్ల ఫైర్..
భారతీయుల SIP సంస్కృతిపై మెర్సిడెస్ ప్రతినిధి వ్యాఖ్యలను నెగెన్ క్యాపిటల్ PMS ఫండ్ మేనేజర్ & వ్యవస్థాపకుడు నీల్ బహల్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. మెర్సిడెస్ కారు కోసం తమను, తమ పిల్లల భవిష్యత్తును పక్కనపెట్టమని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీనిపై మరో వ్యక్తి స్పందిస్తూ.. ఎస్ఐపీకి కారు కొనుగోలుకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. లగ్జరీ కారు కొనుగోలు చేయాలనుకునే వ్యక్తి తన డబ్బును మెరుగైన మార్గాల్లో పెట్టుబడి పెడతాడని అన్నాడు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications