Hyderabad: లంచాలతో రూ.4 కోట్ల సంపాదన.. ఇది శాంపిల్ మాత్రమే..!
కొంత మంది ప్రభుత్వ అధికారులు లంచాలతో కోట్లకు పడగలెత్తుతున్నారు. కొద్ది రోజుల క్రితం డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి ఏసీబీకి పట్టుపడ్డారు. ఆయన రూ.200 కోట్ల వరకు అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. ఆయన తన బంధువులు, తన వద్ద పని చేసే హోం గార్డ్ పేరుపై భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. జూలై 6న భీమ్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. తెలంగాణ, కర్ణాటకలోని భీమ్ రెడ్డి నివాసాలు, ఇతర ప్రాంతాల్లో కలిపి 16 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. వాటి బహిరంగ మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా ఏసీబీకి మరో అవినీతి తిమింగలం చిక్కింది. మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) అడిషనల్ డైరెక్టర్ నల్లగట్ల యాదగిరి రావు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారు. ఆయన భారీగా లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యాదగిరి రావు జీహెచ్ఎంసీ అడిషనల్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేరథ్యంలోనే రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉప్పల్ హైకోర్టు కాలనీలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

పలు స్థిరాస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం రూ.4.75 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. యాదగిరి రావు ఇంట్లో రూ.33.82 లక్షల విలువైన 1.7 కిలోల బంగారు నగలు, రూ.1.80 లక్షల విలువైన3 కిలోల వెండి, రూ.73 లక్షల విలువైన రెండు కార్లు, రూ.2.80 లక్షల విలువైన మూడు బైకులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రూ.36.08 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉప్పల్ హైకోర్టు కాలనీలో రూ.2 కోట్ల విలువైన జీ+3 రెసిడెన్షియల్ బిల్డింగ్, రూ.1.06 లక్షల విలువైన కమర్షియల్ షాప్ ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్లో 12 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని వాటి విలువ రూ.58.63 లక్షలు ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఉప్పల్లో రెండు ఫ్లాట్లు రూ.31.36 లక్షల విలువైనవిగా అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో రూ.4.75 లక్షల విలువైన ఇల్లు కూడా గుర్తించారు. యాదగిరి రావు బినామీలపై పేరుపై ఇంకా ఆస్తులు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications