Instagram down: అత్యంత ప్రజాదరణ పొందిన పలు యాప్‌లు ఈ మధ్య డౌన్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ అయితే ఎప్పటికప్పుడు ఇదే సమస్యతో సతమతం అవుతోంది. మరోసారి తాజాగా డౌన్ కావడంతో మీమర్స్ రెచ్చిపోయారు.
మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. తద్వారా దాని సేవలపై ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది వినియోగదారులకు ఈ యాప్ సేవలు నిలిచిపోయాయి. చేసేదేమీ లేక నెటిజన్లు ట్విట్టర్‌లోకి వెళ్లి తమ ఆగ్రహాన్ని మీమ్స్ ద్వారా వెళ్లగక్కారు. #instagramdown హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు.

కొంతమంది వినియోగదారులు యాప్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. మరికొందరికి 'క్షమించండి, ఫీడ్‌ని రిఫ్రెష్ చేయలేకపోయింది' మరియు 'ఏదో తప్పు జరిగింది' వంటి ఎర్రర్ మెసేజ్‌లు వచ్చాయి. ఇన్‌స్టా సేవల్లో అంతరాయం గురించి వేలాది మంది వినియోగదారులు Downdetector.comలో నివేదించారు.
మే 22న కూడా చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు. తమ ఖాతాలకు లాగిన్ చేస్తున్నప్పుడు సమస్యను ఎదుర్కొన్నారని మరియు ఫీడ్‌లను యాక్సెస్ చేయలేకపోయారని నివేదికలు తెలిపాయి.
కొందరు కథనాలను పోస్ట్ చేసేటప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం USలో లక్ష కంటే ఎక్కువ, కెనడాలో 24 వేలు మరియు బ్రిటన్‌లో 56 వేల మంది వరకు బాధితులేనని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ మాత్రం ఎటువంటి అధికారిక గణాంకాలను విడుదల చేయలేదు.


Click it and Unblock the Notifications