For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెహుల్ చోక్సీకి షాక్: ముంబై ఫ్లాట్, బంగారం, వజ్రాలు.. రూ.14 కోట్ల ఆస్తులు అటాచ్

|

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం గీతాంజలి గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.14.45 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన వాటిలో బంగారం, డైమండ్, ముంబైలోని ఫ్లాట్ ఉన్నాయి. ముంబై-గూర్గాన్‌లోని 1460 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్‌తో పాటు బంగారం, ప్లాటినమ్ జ్యువెల్లరీ, డైమండ్, స్టోన్స్, పెరల్-సిల్వర్ నెక్‌లెస్, వాచీలు, మెర్సిడెజ్ బెంజ్ కారు ఉన్నాయి. అటాచ్ చేసిన ఈ వస్తువులు గీతాంజలి గ్రూప్ కంపెనీలు లేదా మెహుల్ చోక్సీ పేరు మీద ఉన్నాయి.

ప్రతి 4గురిలో ముగ్గురు కొత్త ఉద్యోగం వైపు, వీటిలో అవకాశాలు జంప్!ప్రతి 4గురిలో ముగ్గురు కొత్త ఉద్యోగం వైపు, వీటిలో అవకాశాలు జంప్!

PNB చీటింగ్ కేసులో నీరవ్ మోడీతో పాటు మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈడీ ఇప్పటికే రూ.2,550 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మెహుల్ చోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉన్నాడు. అతనిని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నీరవ్, చోక్సీ కలిసి PNB రూ.13000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు.

Mehul Choksis Mumbai flat, gold, diamonds worth Rs 14.45 crore attached by ED

కాగా, PNB రూ.వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి గత నెలలో సోదరి భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. నీరవ్ మోడీ సోదరి పూర్వి మోడీ, ఆమె భర్త మయాంక్ మెహతా అప్రూవర్‍‌లుగా మారారు. నీరవ్ వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యాధారాలు ఇచ్చేందుకు నెల రోజుల క్రితమే సంసిద్ధత వ్యక్తం చేశారు. పూర్వీ మోడీ, ఆమె భర్త మయాంక్ మెహతాలు అప్రూవర్లుగా మారేందుకు, ప్రాసిక్యూషన్ విట్‌నెస్‌కు ముంబై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కోర్టు జనవరి 5న ఆమోదం తెలిపింది. ఈ జంట గత నెలలో అప్రూవర్లుగా మారుతామంటూ కోర్టును ఆశ్రయించారు. నీరవ్ మోడీ కేసు నుండి తమకు సంబంధం లేదని, ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను అందిస్తామని కోర్టుకు తెలిపారు.

English summary

మెహుల్ చోక్సీకి షాక్: ముంబై ఫ్లాట్, బంగారం, వజ్రాలు.. రూ.14 కోట్ల ఆస్తులు అటాచ్ | Mehul Choksi's Mumbai flat, gold, diamonds worth Rs 14.45 crore attached by ED

The Enforcement Directorate (ED) has attached assets worth Rs 14.45 crore of Gitanjali Group of companies and its director Mehul Choksi in Punjab National Bank fraud case.
Story first published: Thursday, February 4, 2021, 21:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X