MEIL hattricK: దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ మరియు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో మేఘా గ్రూప్ ఒకటి. పలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన చరిత్ర దీని సొంతం. 1989లో హైదరాబాద్ లో స్థాపించబడిన ఈ సంస్థ.. అంచెలంచెలుగా ఎదుగుతూ విదేశాల్లోనూ ప్రాజెక్టులను చేపడుతోంది.
ఇప్పటికే మంగోలియాలో రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ హైదరాబాద్ కంపెనీ మంచి జోరుమీదుంది. తాజాగా అక్కడినుంచే మరో ప్రాజెక్టు చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. గత ప్రాజెక్టుల విలువ 1.436 బిలియన్ డాలర్లు కాగా ప్రస్తుత ప్రాజెక్టు 648 మిలియన్ డాలర్ల విలువైనది కావడం విశేషం.

మంగోలియాలో MEIL ప్రారంభ వెంచర్.. మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ మంగోల్ ఆయిల్ రిఫైనరీ అక్కడ నిర్మాణంలో ఉంది. ఇందులో 598.90 మిలియన్ డాలర్ల విలువైన EPC-2 నిర్మాణాన్ని సైతం కంపెనీ పర్యవేక్షిస్తోంది. దీనిలో ఓపెన్ ఆర్ట్ యూనిట్లు, యుటిలిటీస్, ఆఫ్‌సైట్‌లు మరియు ప్లాంట్ భవనాలు ఉన్నాయి. కాగా అన్ని ప్రాజెక్టుల్లోనూ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది.
అదనంగా EPC-3 దశ కోసం క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌లను MEIL నిర్మిస్తోంది. దీని విలువ 189.72 మిలియన్ డాలర్లు. తాజాగా EPC-4 కోసం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు మంగోల్ రిపైనరీ సంస్థ నుంచి MEIL లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందుకుంది. అక్కడి ఉలాన్ బాతర్ లో జరిగిన కార్యక్రమంలో ఇరుపార్టీలు దీనిపై సంతకాలు చేశాయి.

ఈ కొత్త ప్రాజెక్ట్ వల్ల మంగోలియా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని భావిస్తున్నారు. రష్యన్ చమురు దిగుమతులపై మంగోలియా భారీగా ఆధారపడటాన్ని ఇది తగ్గించనుంది. ఇంధన భద్రతను మెరుగుపరచడమే కాకుండా అంతర్జాతీయ చమురు మార్కెట్లలో హెచ్చుతగ్గుల దుష్ప్రభావం నుంచి దేశాన్న్ి తప్పించవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications