Megatherm Induction IPO: కొత్త ఏడాది జనవరి మాసంలో అనేక కంపెనీల ఐపీవోలు మార్కెట్లోకి అరంగేట్రం చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వస్తున్న ఐపీవో మాత్రం గ్రేమార్కెట్లో తుఫాను సృష్టిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మెగాథెర్మ్ ఇండక్షన్ కంపెనీ ఐపీవో గురించే. దీంతో ఐపీవోలపై బెట్టింగ్ వేసే అనేకమంది ఇన్వెస్టర్ల చూపు ఈ ఐపీవో మీద పడిందని చెప్పుకోవాలి. జనవరి 25న ప్రారంభమై జనవరి 30న ముగుస్తున్న ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.100-108గా ప్రకటించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.53.91 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 49.92 లక్షల కొత్త ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నట్లు మెగాథెర్మ్ ఇండక్షన్ తెలిపింది.

వాస్తవానికి కంపెనీ మెగాథెర్మ్ ఎలక్ట్రానిక్స్ అనుబంధ సంస్థ. కంపెనీ స్టీల్, ఇంజనీరింగ్, రైల్‌రోడ్, పైప్ అండ్ ట్యూబ్, ఆటో అనుబంధ పరిశ్రమలకు సేవలను అందిస్తోంది. కంపెనీకి దేశీయ క్లయింట్ల జాబితాలో MM ఫోర్జింగ్, స్టీల్ యాక్సిల్స్, శ్యామ్ మెటాలిక్స్, శారదా ఎనర్జీ, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఇండియన్ రైల్వేస్, BHEL, టాటా కంపెనీ టాటా మోటార్స్, మహీంద్రా, CESC, హిండాల్కో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి కంపెనీలు ఉన్నాయి.
వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇంకా అధికారికంగా ప్రారంభం కానప్పటికీ గ్రేమార్కెట్లో మాత్రం మంచి ప్రీమియం ధరను పలుకుతోంది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో స్టాక్ రూ.40 పెరుగుదలతో ఉన్నందున లిస్టింగ్ సమయంలో షేర్ రేటు రూ.148గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దరఖాస్తుదారులకు షేర్ల కేటాయింపు జనవరి 31న, లిస్టింగ్ ఫిబ్రవరి 2న ఉంటుందని సమాచారం. మెగాథెర్మ్ ఇండక్షన్ లిమిటెడ్ లాభం 1171.94% పెరిగి FY2022లో రూ.1.1 కోట్ల నుంచి FY23లో రూ.14 కోట్లకు చేరుకుంది. 2023లో కంపెనీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 41.37 శాతం పెరిగి రూ.266.6 కోట్లుగా నిలిచింది.
More From GoodReturns

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications