రాజస్థాన్‌కు చెందిన లేఖ్ రామ్ యాదవ్ సేంద్రీయ వ్యవసాయం పట్ల తనకున్న ఇష్టాన్ని రూ.17 కోట్ల విలువైన సక్సెస్ ఫుల్ వ్యాపారంగా మార్చుకున్నారు. అతను ఐదు సంవత్సరాల క్రితం 120 ఎకరాల భూమితో ప్రారంభించి, ఇప్పుడు 550 ఎకరాల్లో సేంద్రీయ పంటలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు ఇంకా పండ్లను పండిస్తున్నారు. అతను వ్యవసాయంలో తారాచంద్ బెల్జి టెక్నిక్ (TCBT) అలాగే వృక్షాయుర్వేదం వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నాడు. 34 ఏళ్ల లేఖ్ రామ్ యాదవ్ రాజస్థాన్లోని కోట్‌పుట్లీ నివాసి. అయితే అతను సేంద్రీయ వ్యవసాయం తన జీవనోపాధిపై ఎంత సానుకూల ప్రభావాన్ని చూపుతుందో గ్రహించాడు. సేంద్రీయ వ్యవసాయాన్ని పాడి పరిశ్రమ ఇంకా వ్యవసాయంతో కలపడం ద్వారా రాబడి సృష్టించాడు. లేఖ్ రామ్ యాదవ్ విజయ ప్రయాణం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

బయోటెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్: ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన లేఖ్ రామ్ ఐదు సంవత్సరాల క్రితం 120 ఎకరాల భూమితో జీవితాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అతను తన సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని రాజస్థాన్‌లోని మూడు జిల్లాలైన జైపూర్, నాగౌర్, జైసల్మేర్ ఇంకా గుజరాత్‌లోని బోటాడ్‌లో 550 ఎకరాలకు పైగా విస్తరించాడు. నేడు అతని పొలం భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయానికి ఒక ఉదాహరణగా మారింది. లేఖ్ రామ్ యాదవ్ బయోటెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతను DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ GMO టెస్టింగ్లో ప్రత్యేకత ఉన్న NABL- గుర్తింపు పొందిన ల్యాబ్‌లో టెక్నికల్ మేనేజర్‌గా పనిచేశాడు. కానీ, ఉరుకుల పరుగుల పట్టణ జీవితం ఇంకా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు అతని ఆశయాలను అలాగే ఉద్దేశ్యాన్ని ఆలోచించేల చేసింది. దింతో అతను ప్రకృతికి ఇంకా మానవ సమాజానికి ఏదైనా ఉపయోగపడేది చేయాలనీ అనుకుని, ఈ మార్పు చేయడానికి ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నాడు.
యూట్యూబ్ని గురువుగా మార్చుకున్నాను: చాలా పరిశోధన, లోతైన ఆలోచన ఇంకా గంటల తరబడి చర్చల తర్వాత లేఖ్ రామ్ యాదవ్ సేంద్రీయ వ్యవసాయాన్ని జీవన విధానంగా చేసుకున్నాడు. లేఖ్ రామ్ 2013లో 120 ఎకరాల భూమిలో సేంద్రీయ వ్యవసాయం చేయాలనే తన కలను సాకారం చేసుకోవడం స్టార్ట్ చేసాడు. ప్రతి ఒక్క ప్రయాణంలాగే, అతని ప్రయాణం కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కలబంద సాగుతో ఆయన చేసిన తొలి ప్రయోగాలు భారీ నష్టాలను మిగిల్చాయి. అయినా సరే పట్టు వదులుకోలేదు, అతను లోతైన పరిశోధన చేయడం, సెమినార్లకు హాజరు కావడం ఇంకా నిపుణుల నుండి మార్గదర్శకత్వలు ఇంకా YouTube ట్యుటోరియల్స్ చూడడం ద్వారా సేంద్రీయ వ్యవసాయం పై సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. అంతేకాక అతను యూట్యూబ్‌ను తన గురువుగా మార్చుకొని యూట్యూబ్ వీడియోల ద్వారా చాలా నేర్చుకున్నాడు.
ఉపయోగించిన పద్ధతులు: తారాచంద్ బెల్జీ టెక్నిక్ (TCBT) గురించి తెలుసుకున్నప్పుడు లేఖ్ రామ్ ప్రయాణంలో ఒక కీలక మలుపు తిరిగింది. ఎనర్జీ సైన్స్ ఆధారంగా ఈ సాంకేతికత నానో టెక్నాలజీని ఉపయోగించి మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. దీనివల్ల మొక్కలు సహజంగా పెరుగుతాయి. లేఖ్ రామ్ తన పొలంలో TCBT ని అమలు చేసి అద్భుతమైన ఫలితాలను చూశాడు. దాని విజయంతో ప్రోత్సహపడి, అతను ఈ పద్దతిని తన అన్ని పొలాలలో ఉపయోగించడం ప్రారంభించాడు. దీనికి ఆయన వృక్షాయుర్వేద సూత్రాలను కూడా చేర్చారు. ఇది మొక్కల పెరుగుదలను మెరుగుపరచడానికి జీవరసాయన శాస్త్రం ఇంకా భస్మ (బూడిద) రసాయన శాస్త్రాన్ని ఉపయోగించే సాంప్రదాయ భారతీయ వ్యవసాయ శాస్త్రం.
ఇప్పుడు కోట్ల టర్నోవర్: లేఖ్ రామ్ పాడి పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టాడు. అతను సేంద్రీయ పాలు, నెయ్యి ఇంకా జున్ను ఉత్పత్తి చేసే సాహివాల్ ఆవులను పెంచుతున్నాడు. అతని డెయిరీ A2 పాల ఉత్పత్తికి సెర్టిఫైడ్ కూడా. ఇది కాకుండా అతను 22 ఎకరాలలో 56 భోగ్ వాటిక ప్రాజెక్టులను అభివృద్ధి చేశాడు. లేఖ్ రామ్ వ్యవసాయ పర్యాటకాన్ని మొదలు పెట్టాడు. అతని వద్దకు వచ్చే అతిథులను సేంద్రీయ వ్యవసాయాన్ని దాని నిజమైన అర్థంలో అనుభవించాలని ఆహ్వానిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్ వ్యవసాయ పర్యాటక శాఖలో కూడా రిజిస్టర్ చేయబడింది. లేఖ్ రామ్ కంపెనీ యుబి ఆర్గానిక్ ఇండియా ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పండ్లు ఇంకా పాల ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఇప్పుడు దీని వార్షిక టర్నోవర్ రూ. 17 కోట్లకు పైగా సాధించగలుగుతుంది
అభివృద్ధి చెందుతున్న సంస్థ: లెఖ్రామ్ పొలాలు జీవవైవిధ్యం, స్థిరత్వానికి ఒక చక్కటి ఉదాహరణ. అతని వ్యవసాయ పద్ధతి వ్యవసాయం ఇంకా పంట వైవిధ్యీకరణపై ఆధారపడి ఉంటుంది. వీటిలో గోధుమ, పప్పు, ఆవాలు అలాగే మిల్లెట్ వంటి కాలానుగుణ పంటలు ఉన్నాయి. అతను జీలకర్ర, మెంతులు ఇంకా మిరపకాయ వంటి అధిక-విలువైన సుగంధ ద్రవ్యాలతో పాటు టమోటాలు, బంగాళాదుంపలు, క్యాప్సికమ్ అండ్ క్యారెట్లు వంటి అన్ని రకాల కూరగాయలు ఇంకా మామిడి, జామతో పాటు బొప్పాయి వంటి పండ్లను కూడా పండిస్తున్నాడు. అతని పొలాలన్నీ కూడా NPOP-సర్టిఫైడ్ ఆర్గానిక్.
అతని భోగ్ వాటిక ప్రాజెక్ట్ రాజస్థాన్ వ్యవసాయ పర్యాటక శాఖలో కూడా రిజిస్టర్ చేయబడింది, ఇంకా ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకునే వారికి ప్రశాంతమైన స్వర్గధామంగా ఉపయోగపడుతుంది. ఆయన పొలంలో పురాతన ప్రాసెసింగ్ పద్ధతులను కూడా చేర్చారు. అవి రోకలి, మోర్టార్‌తో సుగంధ ద్రవ్యాలను రుబ్బడం, హైడ్రాలిక్ ప్రెస్‌లతో నూనెను తీయడం, పిండి కోసం low-RPM అట్టా చక్కీని ఉపయోగించడం ఉన్నాయి. ఈ సాంప్రదాయ పద్ధతులు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి, ఇంకా ఆహార ఉత్పత్తుల రుచి అలాగే పోషక విలువను కాపాడుతాయి.
కరోనా తరువాత ఇటీవలి సంవత్సరాలలో నాణ్యమైన ఆహారంపై ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది ఇంకా సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. నాణ్యత, నమ్మకం పట్ల దాని నిబద్ధత కారణంగా అతని బ్రాండ్ బలమైన పేరు సంపాదించింది. దింతో అతను సేంద్రీయ వ్యవసాయంలో మార్గదర్శకుడిగా నిలిచాడు. అతని విజయాలు జాతీయంగా గుర్తింపు పొందాయి. గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయంలో అతని ఆవిష్కరణలకి గుర్తింపుగా ' మిలియనీర్ ఆర్గానిక్ ఫార్మర్ ఆఫ్ ఇండియా' వర్గం కింద రెండుసార్లు మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులను కూడా అందుకున్నాడు. అతని జీవిత ప్రయాణం రైతులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications