బిలియనీర్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఆటోమొబైల్ రంగంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో అతనిని ఆకర్షించే పోస్టులు అలాగే అతను చేసే పోస్టులు చాల ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. అంతేకాదు ఎంతోమంది యూజర్లను కూడా ఆలోచించేల ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆనంద్ మహీంద్రా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాపార ప్రపంచంలోనే కాకుండా ఫ్యామిలీ లైఫ్లో, ముఖ్యంగా అతని ఇద్దరు కుమార్తెలు దివ్య, అలిక విషయంలో కూడా మంచి గుర్తింపు పొందారు. ఆటోమొబైల్ రంగంలో ఎన్ని విజయాల కారణంగా ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ అతని కుమార్తెల గురించిన వివరాలు చాలా ప్రైవేట్‌గా ఉంటాయి, కానీ అప్పుడప్పుడు ప్రజలకి ఆసక్తి కలిగిస్తుంటాయి.

1 మే 1955న జన్మించిన ఆనంద్ మహీంద్రా 2012లో ఛైర్మన్ అయినప్పటి నుండి ముంబైకి చెందిన మహీంద్రా గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ఆటోమోటివ్, ఏరోస్పేస్, అగ్రిబిజినెస్ ఇంకా ఐటీతో కూడిన వరల్డ్ కాంగ్లోమరేట్. కంపెనీ సహ వ్యవస్థాపకులలో ఒకరైనా జగదీష్ చంద్ర మహీంద్రా మనవడే ఆనంద్ మహీంద్రా. జర్నలిస్ట్ అనురాధని పెళ్లి చేసుకున్న ఆనంద్ మహీంద్రా జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఇప్పుడు వారి జీవితంలో సొంత మార్గాలలో సక్సెస్ అవుతున్నారు.
దివ్య మహీంద్రా
దివ్య మహీంద్రా 2009లో న్యూయార్క్ నగరంలోని ది న్యూ స్కూల్ నుండి డిజైన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2016లో వెర్వ్ మ్యాగజైన్‌లో ఆర్ట్ డైరెక్టర్ కావడానికి ముందు ఆమె తన కెరీర్‌ను ఫ్రీలాన్స్ గా ప్రారంభించింది. దివ్య న్యూయార్క్‌లో ఆర్కిటెక్ట్ అయిన జార్జ్ జపాటాను పెళ్లి చేసుకుంది.
ఆలికా మహీంద్రా
దివ్య మహీంద్రా చెల్లెలు ఆలికా మహీంద్రా ఒక ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లి చేసుకుంది. అక్క దివ్య లాగానే అలిక కూడా తన పర్సనల్ లైఫ్ ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచుతుంది. ఈ ఇద్దరు అక్కచెల్లెలు ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారని, ఎలాంటి కుటుంబ వ్యాపారాలలో వ్యవహరించడం లేదని నివేదికలు సూచిస్తున్నాయి.
ఆనంద్ మహీంద్రా ఫ్యామిలీ లైఫ్ స్టయిల్
ఆనంద్ మహీంద్రా ఫ్యామిలీ సంప్రదాయామైన జీవితాన్ని ఆనందిస్తుంది. ఆనంద్ మహీంద్రా ముంబైలోని అల్టామౌంట్ రోడ్‌లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు, దీని స్పెషాలిటీ ఫెమస్. ఎందుకంటే అతను అరుదైన శిల్పాలు, ఫెమస్ పెయింటింగ్‌ల కలెక్షన్లను సేకరిస్తుంటారు. మహీంద్రా వాహనాల యాజమాన్యం ద్వారా ఆటోమొబైల్స్ పట్ల అతని మక్కువ స్పష్టంగా కనిపిస్తుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications